Intinti Gruhalakshmi: సంతోషం లో తులసి కుటుంబం.. కొత్త ప్లాన్ తో ఎంట్రీ ఇచ్చిన భాగ్య..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

తులసిని నానా రకాల మాటలు అంటుంటే విసిగిపోయిన తులసి నందు తనకు చేసిన అన్యాయం గురించి, అందువల్ల తాను అనుభవించిన కష్టాల గురించి పూస గుచ్చినట్టు గా చెప్పి అందరి ముందు రెండు మానాలు తీసింది తులసి. మోసం మోసం అంటున్నావు కదా నందగోపాల్ గారు అసలు మోసం అంటే ఏంటో నేను చెబుతాను వినండి అంటూ నందుని దెబ్బిపొడిచినట్టు గా మాట్లాడుతుంది తులసి.

Advertisement

నిన్ను నమ్మి నేను మోసపోయాను, మీరు నా వందేళ్ల జీవితాన్ని బుగ్గిపాలు చేశారు అంటూ ఎమోషనల్ అవుతుంది తులసి. తులసీ మాట్లాడుతుండటంతో నందు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు. మీరు ఎవరో ఆడదాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టిన కూడా ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నించలేదు.

అంతేకాకుండా తనకు కూడా నీకు చేసిన మర్యాద తనకు కూడా చేశాను అది నేను చేసిన అతి పెద్ద తప్పు. మీరు భర్తగా ఒక పెద్ద ఫెయిల్యూర్ అని అంటుంది తులసి. తరువాత చివర్లో నందు మగ తోడు లేకపోతే ఆడదాని కి ఇచ్చే విలువ ఏంటో నేను గడప దాటిన తరువాత నీకు తెలుస్తుంది అని అంటాడు. ఆ తర్వాత అలాగే వెళ్దాం పద అంటూ నుంచి వెళ్ళిపోతాడు నందు, లాస్య.

మరొకవైపు ప్రేమ్, శృతి లు ఇంట్లో ఏం గొడవ జరిగిందో అని ఆలోచించుకుంటూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో రాములమ్మ వచ్చి జరిగినదంతా వివరిస్తుంది. మరొకవైపు తులసి తిరిగి తిరిగి కాళ్లకు బొబ్బలు వస్తాయి. వాటితో తులసి ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వెళ్లిన అనసూయ తులసి కి ఆయింట్మెంట్ వస్తుంది.

Advertisement

ఒక తల్లిగా నాకు ఈ అవకాశం ఇవ్వు తులసి అని అంటుంది. మరొకవైపు లాస్య కొత్త ఇంట్లోకి వెళ్లి జైలు నుంచి బయటకు వచ్చిన అంతా ఆనందంగా ఉంది అని అంటుంది. కానీ నందు మాత్రం ఇంట్లో జరిగిన విషయం గురించి తలచుకుని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత తులసి కి అప్పు ఇచ్చిన ఆమె డబ్బు కోసం ఇంటి దగ్గరకు వచ్చి నేను చెప్పినట్టు వింటే నీకు 20 లక్షలు వచ్చేలా ఏర్పాటు చేస్తాను అని అంటుంది.

కానీ ఈ ఇల్లు నా మీద అవుతుంది అని అనడం తులసి షాక్ అవుతుంది. ఆ తరువాత తులసి తోడికోడలు భాగ్య సరికొత్త ప్లాన్ తో ఎంట్రీ ఇచ్చి ఇంటి మీద నీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel