Guppedantha Manasu: రిషిని రెచ్చగొడుతున్న దేవయాని..వసుని అర్థం చేసుకున్న రిషి..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

కాలేజీలో స్టూడెంట్స్ అందరూ రిషి సార్ డౌన్ డౌన్ అంటూ కాలేజీలో రచ్చరచ్చ చేస్తూ ఉంటారు. ఇక స్టూడెంట్స్ ని వసు ఆపడానికి ప్రయత్నించినా కూడా విద్యార్థులు మరింత రెచ్చిపోతారు. ఇక మీడియా వచ్చి ఆ న్యూస్ ని మరింత గందరగోళం చేస్తూ టీవీలలో ప్రసారం చేస్తుంది. కాలేజీలో గొడవ జరుగుతున్నదాన్ని లైవ్ టెలికాస్ట్ లో జగతి మహేంద్ర దేవయాని లు చూస్తూ ఉంటారు.

Advertisement

ఇక దేవయాని కాలేజీ లో జరుగుతున్న దాన్ని లైవ్ లో చూసి ఆనందంతో సంబరపడుతూ ఉంటుంది. మరొకవైపు జగతి మహేంద్ర లు స్టూడెంట్స్ ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక దేవయాని ఏమీ తెలియనట్టు గారికి ఫోన్ చేసి నాన్న రిషి మన కాలేజీ గురించి టీవీ లో ఎందుకు ఇలా చెబుతున్నారు అంటూ అమాయకంగా అడుగుతుంది.

అంతేకాకుండా గుంత కూడా కావాలనే జగతి, వసు లు కావాలనే చేస్తున్నారు అని చెబుతుంది. మరొకవైపు మహేంద్ర కు మినిస్టర్ ఫోన్ చేసి ఎలా అయినా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి అని చెప్తాడు. ఇంతలో రిషి తో మాట్లాడటం కోసం వసు లోపలికి వెళ్లగా నువ్వు ఏమీ మాట్లాడకు చేసిందంతా చేసి ఇంకా ఏం మాట్లాడతావ్ బయటికి వెళ్ళు అంటూ కోపంగా మండిపడతాడు.

అంతేకాకుండా అందర్నీ రెచ్చగొట్టే ది నువ్వే, శాంతింప చేసేది కూడా నువ్వే నా అంటూ వసు పై విరుచుకు పడతాడు రిషి. ఇక రిషి మాటలకు బాధ పడిన వసు అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇంతలో అక్కడికి మహేంద్ర, రిషి వాళ్ళ పెద్ద నాన్న వస్తారు. ముగ్గురు కలిసి స్టూడెంట్స్ తో కలిసి సమావేశం ఏర్పాటు చేసి, మిషన్ ప్రాజెక్టు ఎందుకు వద్దు అనుకున్నాను తెలుపుతాడు.

Advertisement

కానీ మీడియా వారు మాత్రం రిషిని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇంతలో జగతి వచ్చి దయచేసి ఈ విషయాన్ని పెద్దగా చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేసి ఆ గొడవని అంతటితో ఆపేస్తుంది.
మరొక వైపు దేవయాని జగతి,వసు ఈ విషయంలో రిషి కి లేనిపోనివన్నీ చెప్పి రిషి ని రెచ్చగొడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel