Guppedantha manasu: గౌతమ్‌ని తీసేసి వసూతో పాటు రిషీనే హీరోగా షార్ట్‌ ఫిలింలో యాక్ట్‌ చేస్తాడా..?

Guppedantha manasu: బుల్లితెరపై ప్రేక్షలను ఆకట్టుకుంటూ అత్యంత వీక్షకుల ఆదరణ పొందిన డైలీ సీరియల్‌ గుప్పెడంత మనసు. మరి ఈ సీరియల్‌ తాజా ఎపిసోడ్‌ 21 ఫిబ్రవరి 2022 హైలెట్స్‌ ఏంటో చూద్దాం.

guppedantha manasu latest episode highlights

రిషీ వసూ కోసం జగతి వాళ్ల ఇంటికి వస్తాడు. అంతలో హడావిడిగా రెడీ అవుతున్న వసూ రిషీ రాకను చూసి జగతికి బాయ్‌ మేడం అని చెప్పి వెళ్తుంది. రిషీ వసూ కారులో బయలుదేరతారు. అంతలో రిషీ వసూని మీ మేడంకు ఫోన్‌ చేసి ఇవ్వు అని అడుగుతారు. దానితో మరల కొత్త పంచాయతీ ఏం వస్తుందా అన్న సందేహంతో వసూ జగితికి ఫోన్‌ చేస్తుంది. మేడం రిషీ సర్‌ మీతో మాట్లాడుతారంటా అని రిషీకి ఫోన్‌ ఇస్తుంది. మేడం మీ షార్ట్‌ ఫిల్మం సఫలం అవ్వాలని అనుకుంటున్నాను ఆల్‌ ది బెస్ట్‌ అంటాడు. దానికి జగతి సంతోషించి థ్యాంక్స్‌ సర్‌ అంటుంది.

Advertisement

ఇక కట్‌ చేస్తే దేవయాని కాలేజీలో జరిగే షార్ట్‌ ఫిల్మం చూడడానికి వెళ్తున్నా అని చెప్తూ తన భర్తకు బయలుదేరబోతుంది. నువ్‌ కాలేజీకి వెళ్లడం నాకు ఇష్టం లేదు దేవయానీ అని అంటాడు. నువ్‌ అక్కడికి వెళ్లి జగతిని ఏం కారణం దొరుకుతుందా ఎలా తనను తిట్టాలా అవమాన పరచాలా అని ఆలోచిస్తుంటావ్‌ కాబట్టి నువ్‌ అక్కడికి వెళ్లనవసరం లేదు అంటాడు. నా కాలేజీ నా కొడుకు దగ్గరకు నన్ను వెల్లొద్దు అంటూ మీరు నన్ను అవమానపరస్తున్నారు అండీ అంటూ కోపంగా తన రూంలోకి వెళ్లిపోతుంది దేవయాని. ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న ధరణి చాలా బాగా చెప్పారు మామయ్యగారు జగతి అత్తయ్య మంచితనం గురించి ఇలానే రిషీకి నిజం చెప్పొచ్చు కదా అని అంటుంది. మనం చెప్పడానికి తానే తెలుసుకోవడానికి వ్యత్యాసం ఉంటుంది ధరణి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు

సీన్‌ కట్‌చేస్తే షార్ట్‌ ఫిల్మం కోసం ఏర్పాట్లు జరుగుతుంటాయి. నేను వసూతో పాటు నటిస్తున్నా ఇవ్వాళ ఎలాగైనా వసుకు ఐలవ్‌యూ చెప్పాలని గౌతమ్‌ అనుకుంటాడు. షార్ట్‌ఫిల్మంలో చేసే ఓవరాక్టింగ్‌కి అక్కడ ఉన్న వాళ్లందరికీ తలనొప్పి వస్తుంది. టేక్‌ల మీద టేక్‌లు తీసుకుంటూ ఒక్క సీన్‌ చెయ్యడానికి మధ్యాహ్నం వరకూ చేస్తాడు. దానితో షార్ట్‌ ఫిల్మం డైరెక్టర్‌ లంచ్‌ బ్రేక్‌ ఇస్తాడు. ఇదంతా చూస్తున్న రిషీ సరిగ్గా చెయ్‌రా గౌతమ్‌ అంటాడు. నీకు కుళ్లురా నేను హీరోగా చేస్తున్నానని అంటాడు గౌతమ్‌ రిషీ. ఇక సీన్‌కట్‌ చేస్తే రేపటి ఎసిసోడ్‌లో గౌతమ్‌ని చూసి నేర్చుకోరా అంటూ ఒక సీన్‌ రిషీ యాక్ట్‌ చేసి చూపిస్తాడు. ఇక ఆ షార్ట్‌ఫిల్మంలో హీరోగా రిషీనే నటిస్తాడా లేదా అనేది తదుపరి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel