Karthika Deepam March 23 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకుంటుంది. వంటలక్క డాక్టర్ బాబు ఉన్నప్పుడు ఈ సీరియల్ ఎలాగైతే రేటింగ్ సొంతం చేసుకుందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుని నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా హిమ పుట్టినరోజు కావడంతో పుట్టినరోజు జరుపుకున్న అనంతరం హాస్పిటల్ లో అందరికీ తన పుట్టిన రోజు సందర్భంగా స్వీట్లు పంచుతుంది. ఈ విధంగా స్వీట్లు పంచి అనంతరం హాస్పిటల్లో ఒక ఒక వ్యక్తి ద్వారా సౌర్య ఆచూకీ కనుక్కుంటుంది. తన పుట్టిన రోజే సౌర్య ఆచూకీ తెలియడంతో హిమ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తొందరగా ఆ మహిళ చెప్పిన అడ్రస్ కు బయలుదేరుతుంది.

Karthika Deepam March 23 Today Episode
మరోవైపు జ్వాలా హిమ కారణంగా తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నానని ఎంతో బాధపడుతూ తన పై ప్రతీకారం పెంచుకుంటుంది. తన తల్లిదండ్రులు చనిపోయిన సంఘటనలు ఊహించుకుని ఆ హిమ వదిలేదే లే అని మనసులో అనుకుంటుంది. ఇలా తన తల్లిదండ్రులు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ హిమ పై ఏ మాత్రం కోపం తగ్గకుండా… తన పై ప్రతీకారం పెంచుకుంటుంది.అమ్మానాన్నలను చంపడమే కాకుండా నన్ను అందరికీ దూరం చేసి తను మాత్రం అందరితో కలిసి ఉంటుంది. అంటూ మనసులో తన పై కోపం తెచ్చుకుంటుంది. ఇక సౌర్యను కలవడానికి ఎంతో ఆతృతగా వెళ్తున్న హిమ మాత్రం పుట్టిన రోజే సౌర్యను కలుసుకున్నందుకు దేవుడికి మనసులో థాంక్స్ చెబుతుంది.
ఇలా హిమ సౌర్య దగ్గరకు సంతోషంగా వెళ్తున్న సమయంలో కారు ట్రబుల్ ఇస్తుంది. దీంతో ఆ కారును జ్వాలా(సౌర్య) రిపేర్ చేస్తుంది. ఇలా ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇక్కడ కలిసినప్పటికీ వాళ్లకి ఆ విషయం తెలీదు. కారు రిపేర్ అయిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక జ్వాలా మాత్రం తాను తల్లిదండ్రులకు భావించిన చంద్రమ్మ, ఇంద్రుడితో కలిసి షాపింగ్ చేయడానికి వెళ్తుంది. తన తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ చేసి బయటకు వస్తుండగా జ్వాలా ప్రేమ్ తన ఆటోకి అడ్డుగా ఉన్నాడని తనతో పెద్ద ఎత్తున గొడవ పెట్టుకుని వెళ్తుంది. హిమ హాస్పిటల్ లో చెప్పిన ఆమె అడ్రస్ కి వెళ్లి సౌర్య గురించి ఆరా తీయగా అలాంటి వాళ్ళు ఎవరూ లేరని చెప్పడంతో ఎంతో బాధగా వెన తిరుగుతుంది.
ఇక హిమ, నిరుపమ్ కలిసి వాళ్ళమ్మ స్వప్న దగ్గరికి వెళ్తారు. స్వప్న హిమను చూడగానే ఏమ్మా నీకు ఇంకా డ్రైవింగ్ సరదా తీరలేదా అంటూ హిమను బాధ పెడుతుంది. ఇలా స్వప్న అన్న మాటలకు హిమ బాధపడుతుంది. దీంతో నిరుపమ్ ఏంటమ్మా అలా మాట్లాడతావు అంటూ స్వప్నపై కోపడ్డగా నీకేం తెలుసు రా.. నా తమ్ముడిని పోగొట్టుకున్నాను అంటూ స్వప్న అనడంతో హిమ బాధపడుతుంది.ఇక షాపింగ్ మాల్ దగ్గర ఎవరితో అయితే జ్వాల గొడవ పెట్టుకుందో తిరిగి వాళ్ళ ఇంటికి చంద్రమ్మ ఇంద్రుడిని తీసుకొని వస్తుంది. ప్రేమ్ ఇంటి దగ్గర జ్వాలను చూసేసరికి ప్రేమ్ మరింత కోపం వ్యక్తం చేస్తాడు. నేటితో ఈ ఎపిసోడ్ పూర్తి కాగా తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.
Read Also : Karthika Deepam : పగతో రగిలిపోతున్న సౌర్య.. సౌందర్య ఇంట్లో పుట్టినరోజు వేడుకలు..?