Prabhas Remuneration : మారుతితో ప్రభాస్‌ హారర్ మూవీ.. రూ.75 కోట్ల రెమున్యరేషన్.. రోజుకు ఎంతంటే?

Prabhas Remuneration : పాన్ ఇండియా మూవీ బాహుబలి రికార్డుల తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలితో పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ మారిపోయాడు. బాహుబలికి ముందు సౌత్ ఇండియాకే ప్రభాస్ క్రేజ్ ఉండేది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దక్షిణాది నుంచి నార్త్ ఇండియాకు వరకు వెళ్లింది. ప్రభాస్ రేంజ్ మాత్రమే కాదు.. ఆయన రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో పెరిగిపోయింది. ప్రభాస్ తాను చేసే ప్రతి సినిమాకు రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.. టాలీవుడ్ ఇదే టాక్ నడుస్తోంది.

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ మార్చి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను భారీ బడ్జెట్‌‌తో తెరకెక్కించగా.. బాక్సాఫీసుల వద్ద రికార్డులను మోగిస్తోంది. రాధేశ్యామ్ మూవీ తర్వాత ప్రభాస్ మరో కొత్త మూవీలో నటిస్తున్నాడు. మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ హారర్ కామెడీ మూవీలో నటించనున్నాడు. అయితే ఈ మూవీకి ముందుగానే 60 రోజులకే కాల్ షీట్స్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది. ఈ 60 రోజులకే ప్రభాస్ ఏకంగా రూ. 75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా సమాచారం.

అంటే.. ప్రభాస్ రెమ్యునరేషన్ ఒక రోజుకు రూ.1.25 కోట్లు అనమాట.. మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తున్న ఈ కొత్త మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారట.. వీరిలో ఉప్పెన్ ఫేమ్ కృతిశెట్టి ఒకరుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ K, ఆదిపురుష, సాలార్ మూవీలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీలను పూర్తి చేసిన వెంటనే మారుతి మూవీ మొదలు కానున్నట్టు టాలీవుడ్ టాక్..

Advertisement

Read Also :  Radhe Shyam Box Office Collection Day 1 : ‘రాధేశ్యామ్‌’ మొదటి రోజు వసూళ్లు ఎన్ని కోట్లుంటే..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel