Crime News: గంజాయి మత్తులో కోసం నేరాలకు పాల్పడిన యువకులు.. చివరకు కటకటాల వెనక్కి..!

Crime News: మందు, సిగరెట్టు,గంజాయి తీసుకోవటం వంటి చెడు వ్యసనాలకు అలవాటుపడి వాటికి బానిసలు అవుతున్నారు. గంజాయి కి అలవాటు పడిన ముగ్గురు యువకులు ఇటీవల నేరాలకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే..నర్సీపట్నం కు చెందిన రాజేష్, గాజువాక కు చెందిన నాని, శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన స్వరూప్, విశాఖ కు చెందిన కళ్యాణ్ మంచి స్నేహితులు. గంజాయి కి అలవాటు పడిన వీరు డబ్బులు లేక దారి దోపిడీలు చేసి మరీ గంజాయి తీసుకుంటున్నారు.

ఇటీవల రాజేష్, నాని ఇద్దరు గాజువాకలో ఆటో దొంగతనం చేసి పారిపోయారు. మిగిలిన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆటోలో రావికమతం వెళ్లి గంజాయి తాగుతూ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన తెల్లవారుజామున రాజారావు అనే వ్యాపారి నిట్టమామిడి వెళ్లేందుకు దొండపూడి వద్ద ఎదురుచూస్తున్నాడు. వ్యాపారి దగ్గర డబ్బులు ఉన్నాయా అని గ్రహించిన వీరు అతనిని ఆటోలో ఎక్కించుకొని కేఎల్ పురం వద్ద ఆటోని పక్కదారి పట్టించి అతని మీద దాడి చేసి బ్యాగులో ఉన్న రెండు లక్షల రూపాయల నగదు, బంగారు ఉంగరం సెల్ ఫోన్ తీసుకొని పారిపోయారు.

ఈ ఘటన గురించి రాజారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఇప్పటికే పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న రాజేష్ నర్సీపట్నం వెళ్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆటోలో కొందరు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని ఆపి విచారించగా అసలు విషయం బయటపడింది. దొండపూడి వద్ద భారీ దొండపూడి పాల్పడిన దొంగలు వారేనని నిర్ధారించారు. వారి వద్ద నుండి 85 వేల రూపాయలు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేయగా మరొక యువకుడు పరారీలో ఉన్నాడు.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel