వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Crime News: అక్క పై ప్రేమతో భార్యను బలితీసుకున్న భర్త.. కేవలం ఆ చిన్న మాటకి భార్యను చంపిన భర్త!

Crime News: భార్యాభర్తల మధ్య బంధం పదికాలాలపాటు ఎంతో అన్యోన్యంగా కొనసాగాలని భావిస్తారు అయితే వీరి బంధంలో చిన్నపాటి మనస్పర్ధలు రావడం సర్వసాధారణం ఇలా వచ్చినప్పుడు ఎవరో ఒకరు కాస్త వెనక్కి తగ్గితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది లేదంటే ఆ సమస్య ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తుందని ఎన్నోసార్లు రుజువైంది.ఇలా ఎంతో మంది చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగానే ఆత్మహత్య చేసుకుంటూ వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్న సంఘటనలను గురించి మనం రోజు వింటున్నాము. ఈ ... Read more

By Ramesh Babu

Published on: March 4, 2022 2:20 PM

Updated on: March 4, 2022 2:20 PM

---Advertisement---

Crime News: భార్యాభర్తల మధ్య బంధం పదికాలాలపాటు ఎంతో అన్యోన్యంగా కొనసాగాలని భావిస్తారు అయితే వీరి బంధంలో చిన్నపాటి మనస్పర్ధలు రావడం సర్వసాధారణం ఇలా వచ్చినప్పుడు ఎవరో ఒకరు కాస్త వెనక్కి తగ్గితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది లేదంటే ఆ సమస్య ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తుందని ఎన్నోసార్లు రుజువైంది.ఇలా ఎంతో మంది చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగానే ఆత్మహత్య చేసుకుంటూ వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్న సంఘటనలను గురించి మనం రోజు వింటున్నాము.

ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. సానివాడ గ్రామానికి చెందిన 30 ఏళ్ల పొన్నాడ కల్యాణి భర్త నవీన్ కుమార్ నివసిస్తున్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి అయితే వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగి చివరికి నవీన్ కుమార్ తన భార్య కళ్యాణి పై దాడి చేయడంతో కళ్యాణి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నవీన్ తన సోదరి అంటే ఎంతో ప్రేమ. తన అక్క మాటని తప్పకుండా పాటించే వ్యక్తిత్వం కలవాడు నవీన్. అయితే నవీన్ కల్యాణి దంపతులకు 2015 లో వివాహం జరిగింది.వీరి వివాహం జరిగి ఏడూ సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ వీరికి సంతానం లేకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.ఇక శివరాత్రి పండుగ సందర్భంగా సంతానం కోసం ఉపవాసం ఉండి పూజ చేయమని నవీన్ సోదరి చెప్పడంతో కల్యాణి తన మాట వినకుండా తన పని తాను చేసుకుంది. ఈ క్రమంలోనే నవీన్ సోదరి తాను చెప్పిన మాట కల్యాణి వినడం లేదని తన భర్తకు ఫిర్యాదు చేయడంతో నవీన్ తన భార్యను అక్క చెప్పిన మాట ఎందుకు వినలేదు అంటూ ప్రశ్నించాడు.దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో మాట మాట పెరిగి చివరికి నవీన్ కళ్యాణి మొహంపై ఊపిరి ఆడకుండా చేయడంతో ఆమె మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.ఇక కళ్యాణి హత్య వెనుక తన ప్రమేయం ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel