Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Crime News:రష్యన్‌ మోడల్‌ దారుణ హత్య.. పుతిన్‌ను తిడుతూ2021 జనవరిలో ఓ వివాదాస్పద పోస్ట్‌..!

Crime News: ప్రస్తుతం రష్యాలో రష్యన్‌ మోడల్‌ గ్రెట్టా వెడ్లెర్‌ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవైపు ప్రస్తుతం రష్యాలో యుద్ద వాతావరణ ఉంటే మరొకవైపు స్టార్ మోడల్ హత

By Ramesh Babu

Published on: March 19, 2022 10:46 AM

Updated on: March 19, 2022 10:46 AM

---Advertisement---

Crime News: ప్రస్తుతం రష్యాలో రష్యన్‌ మోడల్‌ గ్రెట్టా వెడ్లెర్‌ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవైపు ప్రస్తుతం రష్యాలో యుద్ద వాతావరణ ఉంటే మరొకవైపు స్టార్ మోడల్ హత్యకు గురవడం సంచలనంగా మారింది. గ్రెట్టా వెడ్లెర్..ఒక మోడల్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. అయితే ఆమె రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యతిరేకి. గతంలో పుతిన్‌ను సైకోపాత్ అంటూ పుతిన్‌ను తిడుతూ.. 2021 జనవరిలో సోషల్‌ మీడియాలో ఓ వివాదాస్పద పోస్ట్‌ చేసింది.

pjimage 64ఇలా పోస్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత గ్రెట్టా కనిపించకుండా పోయింది. చివరికి పాత సూట్ కేసులో ఆమె శవం లభ్యం అయ్యింది. పుతిన్ వ్యతిరేకి అయిన మోడల్ పుతిన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. “బాల్యంలో పుతిన్ చాలా అవమానాలను చవిచూశాడు. అందువల్ల న్యాయ విద్యను విడిచిపెట్టి KGB లో చేరాడు. అందుకే నా దృష్టిలో అతనొక మానసిక రోగి” అంటూ కామెంట్లు చేసిందామె. పుతిన్ గురించి ఇలా వాక్యాలు చేసిన తర్వాత కొన్నివారాలకు ఆమె కనిపించకుండా పోవటంతో నానా కథనాలు వెలువడ్డాయి.

Advertisement

మోడల్ తాజాగా హత్యకు గురైందంటూ రష్యా దర్యాప్తు కమిటీ ఒకటి ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. కేవలం డబ్బు కోసం జరిగిన వాగ్వాదంలో ఆమెను చంపేసినట్లు ఆమె ప్రియుడు కోరోవిన్‌ అంగీకరించాడు. పుతిన్ గురించి వ్యాఖ్యలు చేసినందుకు.. ఆమె హత్యకు ఎటువంటి సంబంధం లేదు అని ఆమె ప్రియుడు వెల్లడించారు. మోడల్ మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.