Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది తెలుసుకుందాం.. జగతి, మహేంద్ర ఇంటి బయట కూర్చుని ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు..
ఇంతలో రిషి, వసు ని ఇంటిదగ్గర దింపి వెళ్ళిపోతాడు. జగతి, మహేంద్ర లను చూసిన రిషి బాధతో అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఏంటి వసు ఇవాళ మా పుత్రరత్నం కోపంగా ఉన్నాడా అని మహేంద్ర అడగగా, అప్పుడు వసు, రిషి సార్ గురించి తెలిసిందే కదా సార్ ఒకసారి కోపం గా ఉంటాడు, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు అని రిషి గురించి చెబుతూ ఉండగా, ఇంతలో కారులో రిషి వెనక్కి వచ్చి మహేంద్ర కు హాయ్ డాడ్ గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు.
మరొకవైపు రిషి, ఫణీంద్ర దగ్గరకు వెళ్లి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు విషయంలో మనకు ఎంతో సహాయం చేసిన మినిస్టర్ గారికి సన్మానం చేద్దాం అని అని అంటాడు. అయితే ఇందుకోసం నువ్వు నేను కలిసి మినిస్టర్ దగ్గరికి వెళ్దాం పెద్దనాన్న అని అనడంతో అందుకు ఫణింద్ర ఓకే అని చెబుతాడు.
ఆ తర్వాత కాలేజీ కి వచ్చిన రిషి, వసు దగ్గరికి వచ్చి నువ్వు కూడా మినిస్టర్ సార్ దగ్గరికి వస్తున్నావు కదా అని అనడంతో ఆ ఓకే సార్ అని అంటుంది వసు. అలా వసు, రిషి లు కారులో వెళుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మినిస్టర్ దగ్గరికి రిషి,వసు,ఫణింద్ర, జగతి మహేంద్ర లు కూడా వస్తారు. ఆ తర్వాత సన్మాన కార్యక్రమం కోసం మినిస్టర్ ని ఇన్వైట్ చేసి వెళ్తారు.
ఆ తర్వాత రిషి మినిస్టర్ దగ్గర ఫోన్ మర్చిపోయాను అని వెనక్కి వెళ్లి ఫోన్ తెచ్చుకుంటాడు.. ఆ తర్వాత వసు, రిషి ఇద్దరూ కలిసి బరువులు తినడానికి బయటకు వెళ్తారు.
అక్కడ రిసీవ్ చేసే హంగామా చూసి వసు నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు ఉంది సార్ అని అంటుంది. అప్పుడు రిషి ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు అని ఊరికే అనలేదు అని అంటాడు. ఇద్దరు కలిసి తింటూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.