Devatha serial Oct 1 Today Episode : తెలుగు బుల్లితెర పై దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మాధవ తన తల్లి జానకి కి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో మాధవ, నా నుంచి రాధని దూరం చేయాలని చూస్తే అందరికీ నీకు పట్టిన గతే పడుతుంది అంటూ జానకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంతలోనే అక్కడికి చిన్మయి దేవి వస్తారు. అప్పుడు దేవి, చిన్మయి లు నీకేం కాదు అవ్వ పెద్ద డాక్టర్ వచ్చింది కదా నీకు నయం చేస్తుంది నువ్వు ఎప్పటిలాగే తిరుగుతావు అని ధైర్యం చెబుతూ ఉంటారు. మరొకవైపు సత్య,దేవుడమ్మకి కాపీ తెచ్చి ఇస్తుంది.
అప్పుడు సత్య, ఆదిత్య గురించి బాధపడుతూ ఉండగా అప్పుడు దేవుడమ్మ ఆదిత్య ఆ ఇంటికి వెళ్ళింది దేవి కోసం కాదు జానకమ్మ కోసం అని అంటుంది దేవుడమ్మ. ఇంతలోనే ఆదిత్య అక్కడికి వస్తాడు. అప్పుడు దేవుడమ్మ జానకమ్మ గురించి డాక్టర్ గారు ఏం చెప్పారు అని అడుగగా, త్వరలోనే నయం అవుతుందని చెప్పారు ఆ మాటతో అందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు.
కానీ జానకమ్మ గారు మాత్రం ఏదో భయం లో ఉన్నారు అమ్మ అని అంటాడు ఆదిత్య. అప్పుడు దేవుడమ్మ ఆఫీస్ లో అలాంటి ప్రమాదాలు జరగడం మానసికంగా కోల్పోవడం కస్తూనే ఆదిత్య అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో సత్య ఎప్పుడు బయట వాళ్ల సమస్యలు ఇంట్లో ఉన్నది నా సమస్య పట్టించుకోరు అని బాధపడి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.
దేవత సీరియల్ అక్టోబర్ 1 ఎపిసోడ్ : డాక్టర్ కి యాక్సిడెంట్.. మాధవ పై అనుమాన పడుతున్న రాధ..?
మరొకవైపు జానకి ఏదో చెప్పాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ రుక్మిణికీ ఏమీ అర్థం కాదు. నీకు నయం అయ్యే వరకు నేను చూసుకుంటాను అని ధైర్యం చెబుతూ ఉంటుంది రుక్మిణి. ఇంతలో మాధవ టెన్షన్ పడుతూ అక్కడికి వచ్చి మా అమ్మ చెప్పింది నాకు అర్థం అయింది అందరినీ జాగ్రత్తగా చూసుకో అని చెబుతోంది అంటూ మాధవ కవర్ చేస్తూ ఉంటాడు.
ఇంతలోనే ఆదిత్య రాధ కి ఫోన్ చేసి జానకమ్మ కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కి యాక్సిడెంట్ అయింది ఆమె ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితిలో ఉంది అని చెప్పడంతో రాధ షాక్ అవుతుంది. అప్పుడు రుక్మిణి బాధపడుతూ ఉండగా మాధవ నేనున్నాను కదా నిన్ను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రాధకు మాధవ పై అనుమానం మొదలవుతుంది.
మరొకవైపు దేవుడమ్మ జానకి ఆక్సిడెంట్ ఎలా జరిగింది అని ఆదిత్యాను అడుగుతూ ఉండగా ఇంతలో సత్య కోపంతో గట్టిగా అరుస్తూ జానకమ్మను చూసుకోవడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా నువ్వు తప్ప ఎవరు లేనట్టు ఆవిడ గురించి టెన్షన్ పడుతున్నావ్ ఏంటి ఆదిత్య అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆదిత్య ఏంటి సత్య చదువుకున్న నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు వాళ్లకు ఎవరూ లేక కాదు వాళ్ళకంటే పెద్దవాళ్లు నాకు తెలిసి ఉంటారు. ఆఫీసర్ మాట వింటారు అన్న ఉద్దేశంతో వాళ్ళని అడిగారు అని అంటాడు ఆదిత్య. అప్పుడు దేవుడమ్మ కూడా ఆదిత్య కు సపోర్ట్ గా మాట్లాడుతుంది.
Read Also : Devatha Serial సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : ఆదిత్య గురించి బాధపడుతున్న సత్య.. మాధవ మాటలకు భయపడిపోయిన జానకి..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World