Devatha May 28 Today Episode : సత్య మాటలకు షాక్ అయిన దేవుడమ్మ, ఆదిత్య.. బాధలో రాధ..?

Devatha May 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తనకు పిల్లలు కలగరు అని తెలుసుకున్న సత్య కుమిలిపోతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య ఇంటికి రావడంతో సత్య ఎమోషనల్ గా దండం పెట్టి ఆ తర్వాత ఆదిత్యను పట్టుకుని ఏడుస్తుంది. మీరు చాలా మంచి వారు, మీరు దేవుళ్ళు, నా బాధను మీపై వేసుకొని మంచిగా చూసుకున్నారు అంటూ డాక్టరు చెప్పిన విషయాలను ఆదిత్యకు చెప్పి ఎమోషనల్ అవుతుంది సత్య.

Devatha May 28 Today Episode
Devatha May 28 Today Episode

అప్పుడు సత్య ఈ ఇంట్లో ఈ లోకం లో ఉండను అని అనడంతో దేవుడమ్మ, ఆదిత్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు దేవుడమ్మ సత్యను ఓదారుస్తుంది. ఆ తర్వాత ఆదిత్యను మెచ్చుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

Advertisement

మరొకవైపు దేవి, మాధవ అన్న మాటలనే గుర్తుతెచ్చుకొని పదేపదే బాధ పడుతూ ఉండగా ఇంతలో అక్కడికి రాధ రావడంతో అప్పుడు దేవి ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మనేనా అనటంతో రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. దేవి ఇలా మాట్లాడడానికి కారణం మాధవ అని అనుకొని బాధపడుతూ ఉంటుంది.

మరొకవైపు భాగ్యమా దగ్గరికి భాషా కమల ఇద్దరూ వెళ్తారు. అప్పుడు ఎందుకు వచ్చారు అని వచ్చేదాన్ని కదా అని అనగా బిడ్డకోసం వచ్చాము అని అనడంతో భాగ్యమ్మ ముందే చెప్పాను కదా బిడ్డ ఇచ్చేది లేదు అని అంటుంది.

అప్పుడు సత్య విషయం గురించి మొత్తం వివరించడంతో భాగ్యమ్మ కిందపడి ఎందుకు నా బిడ్డలకు ఇలా జరుగుతుంది అంటూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడు కమలతో అన్న మాటలను గుర్తు తెచ్చుకొని మరింత బాధ పడుతుంది.

Advertisement

మరొకవైపు దేవుడమ్మ గతంలో ఆదిత్య తో మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా రాజమ్మ అక్కడికి వస్తుంది. పిల్లలతో ఆడుకోవాలని లేదా అని అనడంతో దేవుడమ్మ గతంలో స్వామి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని వారసులు పుట్టే వరకు ఎదురు చూస్తాను అని అంటుంది.

ఆ తర్వాత అక్కడనుంచి వెళ్ళి పోతూ ఉండగా సూరి ఎదురుపడి ఇన్ని రోజులు మీ దగ్గర ఒక విషయం దాచాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు రుక్మిణి గర్భవతి అని అనడంతో దేవుడమ్మ రాజమ్మ షాక్ అవుతారు.

అప్పుడు రుక్మిణి ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు అంటూ తన దగ్గర ఒట్టు వేయించుకుందని అందుకే ఈ విషయాన్ని ఇన్ని రోజులు ఎవరికీ చెప్పకుండా దాచాను అని అంటాడు సూరి. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also :  Devatha May 27 Today Episode : మాధవపై కోప్పడ్డ రాధ..అసలు విషయాన్ని చెప్పేసిన ఆదిత్య సూరి..?

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel