Intinti Gruhalakshmi Aug 26 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో తులసి సామ్రాట్ ఇంటికి వెళ్లడంతో సామ్రాట్ ఇన్విటేషన్ కార్డు ఇచ్చి తులసినీ సంతోష పెడతాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఆహ్వాన పత్రిక చూసిన తులసి ఆనందపడుతూ సామ్రాట్ కి ధన్యవాదాలు తెలుపుతుంది. అప్పుడు పరంధామయ్య ఇందులో పేరు రావడానికి సామ్రాట్ కారణమైన ఆ పేరు నిలబెట్టుకోవడానికి బాధ్యత మాత్రం ఇదే తులసి అని అంటాడు. అప్పుడు తులసి నేను ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్తాను అని ఆనందపడుతూ ఉంటుంది.

మరొకవైపు అనసూయ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండగా ఇంతలో నందు లాస్యలు అక్కడికి తులసి కోసం వస్తారు. అప్పుడు అనసూయ లాస్య ని ఉద్దేశించి కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు నందు మేము బిజినెస్ మీద వచ్చాము తులసి ఉందా అనడంతో ఇంతలో అభి అక్కడికి వచ్చి మామ్ లేదు అనటంతో వెంటనే లాస్య కాస్త వెటకారంగా తులసిని తప్పుపడుతూ మాట్లాడుతుంది.
Intinti Gruhalakshmi Aug 26 Today Episode : సామ్రాట్ ఆహ్వాన పత్రికను చింపేసిన అభి..
మరొకవైపు సామ్రాట్ వల్ల బాబాయ్ నువ్వు స్వీట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి అంటూ తులసికి కండిషన్ పెడతాడు. అప్పుడు తులసి సామ్రాట్ ఇద్దరూ కలసి స్వీట్ చేస్తారు. మరొకవైపు నందు లాస్య లు తులసి కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే తులసి స్వీట్ తీసుకొని ఆనందంగా ఇంటికి వస్తుంది.
అప్పుడు లాస్య ఎక్కడికి వెళ్లావు తులసి అని అడగగా సామ్రాట్ ఇంటికి వెళ్లాను అనటంతో ఇంత ఉదయాన్నేనా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది లాస్య. ఇంతలో పనుందామయ్య అక్కడికి వచ్చి లాస్య నందుకి తగిన విధంగా బుద్ధి చెబుతాడు. అప్పుడు అనసూయ ఏమైంది అని అడగగా భూమి పూజ కోసం ఆహ్వాన పత్రిక వచ్చింది అనడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు.
ఇప్పుడు నందు లాస్య అది చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. అప్పుడు తులసి సామ్రాట్ పేర్లు పక్క పక్కనే ఉంది అని చూసి అభి నానా రచ్చ చేసి ఆహ్వాన పత్రికను చింపేస్తాడు. దాంతో తులసి బాధపడుతూ ఉండగా నందు లాస్యలు సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు అభినీ పరంధామయ్య కొట్టబోతాడు.ఆ తరువాత రేపు అందరూ కలిసి వెళ్తున్నాము అని గట్టిగా చెబుతాడు పరందామయ్య.
అప్పుడు అనసూయ కూడా సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. మరొకవైపు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఇద్దరు స్వీట్ తింటూ ఎంజాయ్ చేస్తూ తులసిని పొగుడుతూ ఉంటారు. ఆ తర్వాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ పెళ్లి గురించి మాట్లాడగా ఆ టాపిక్ వదిలే బాబాయ్ అని అంటాడు. ఆ తర్వాత తులసి ఒంటరిగా కూర్చుని జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అది చూసి దివ్య కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది..
Read Also : Intinti Gruhalakshmi Aug 24 Today Episode : తులసిపై అనుమాన పడుతున్న అనసూయ, అభి.. సంతోషంలో సామ్రాట్..?
- Intinti Gruhalakshmi Nov 1 Today Episode : తులసి మాటలకు ఆశ్చర్యపోయిన సామ్రాట్,ప్రేమ్.. నందుని మరింత రెచ్చగొట్టిన లాస్య..?
- Intinti Gruhalakshmi: తులసిని కొత్త మేనేజర్ గా నియమించిన సామ్రాట్.. కోపంతో రగిలిపోతున్న నందు లాస్య..?
- Intinti Gruhalakshmi July 13 Today Episode : అమ్మవారికి బోనం సమర్పించిన తులసి.. కోపంతో రగిలిపోతున్న లాస్య..?













