వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Intinti Gruhalakshmi Aug 31 Today Episode : నందు పై విరుచుకుపడిన లాస్య.. కోపంతో రగిలిపోతున్న అభి..?

Intinti Gruhalakshmi Aug 31 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అభి చివర్లో వచ్చి నానా రచ్చ చేస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో అభి సంబంధం లేని మీరు పక్కపక్కన కూర్చుని పూజ చేయడం నాకు నచ్చడం లేదు. సామ్రాట్ గారు అమ్మకి దగ్గర ... Read more

By Ramesh Babu

Published on: August 31, 2022 11:29 AM

Updated on: August 31, 2022 1:19 PM

Prem loses his cool as Abhi blames Tulasi in todays intinti gruhalakshmi serial episode

---Advertisement---

Intinti Gruhalakshmi Aug 31 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అభి చివర్లో వచ్చి నానా రచ్చ చేస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో అభి సంబంధం లేని మీరు పక్కపక్కన కూర్చుని పూజ చేయడం నాకు నచ్చడం లేదు. సామ్రాట్ గారు అమ్మకి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నాడు అని అనడంతో ఎక్కడున్నా వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు ప్రేమ్ అభిని ఆపడానికి ప్రయత్నిస్తూ నీతో వెనకాల ఉండి ఎవరిని నడిపిస్తున్నారు అందరికీ తెలుసు ఇప్పుడు అందరి ముందు ఇది మాట్లాడటం అవసరమా అని అంటాడు ప్రేమ్.

Intinti Gruhalakshmi Aug 31 Today Episode
Intinti Gruhalakshmi Aug 31 Today Episode

అప్పుడు అభి బంగారు లాంటి ప్రాజెక్ట్ పట్టుకుని నందగోపాల్ గారు వస్తే మీరు దేనికి పనికిరాని ఈ ప్రాజెక్టుని ఒప్పుకున్నారు అని అంటారు. అప్పుడు దీపక్ ఇన్వాల్వ్ అయ్యి నందు గురించి మాట్లాడడంతో వెంటనే నందు నేనేమి మీ అక్క జీవితం నాశనం చేయలేదు. తానే ఈ విడాకులకు కారణం అని అంటాడు. ఆ మాటకు సామ్రాట్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు సామ్రాట్ అంటే తులసి గారి మాజీ భర్త నువ్వా అని అంటాడు.

దాంతో లాస్య నందు ఇద్దరు ఒకసారిగా షాక్ అవుతాడు. అప్పుడు పరంధామయ్య అందరూ ఆపండి నా కొడుకు ఇద్దరూ నా చేయి దాటిపోయారు నన్ను క్షమించండి సామ్రాట్ గారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పరంధామయ్య. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్లిన తర్వాత అందరూ కలిసి అభిని తిడుతూ ఉంటారు. అప్పుడు ప్రేమ్, అభికి ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కూడా వినిపించుకోకుండా ఏదో ఒక రోజు మీకు నిజం తెలుస్తుంది.

Intinti Gruhalakshmi Aug 31 Today Episode : కోపంతో రగిలిపోతున్న అభి..

ఆరోజు మీరే నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు అని అంటాడు అభి. అప్పుడు శృతి నేను ఈ విషయం గురించి ముందే సామ్రాట్ తో మాట్లాడాను సామ్రాట్ గారికి ఆంటీ ఎదగడానికి సహాయం చేయడం తప్ప ఇంకేం ఉద్దేశం లేదు అని అంటుంది. వెంటనే అభి దొంగతనం చేసిన వాడు ఎప్పుడు దొంగ అని ఒప్పుకోడు కదా అంటూ తులసినే అవమానించే విధంగా మాట్లాడతాడు. అప్పుడు, ప్రేమ్ తిట్టి ఆ నంద గోపాల్ కోసం అమ్మని తలదించుకునేలా చేస్తున్నావా అని అనగా నాన్నని పేరు పెట్టి పిలుస్తున్నావ్ ఏంటి అని అభి అంటాడు.

మా అమ్మ పేరు తీయడానికి నీకు తప్పులేదు కానీ మీ నాన్న నీ పేరు పెట్టి పిలుస్తే నీకు తప్పొచ్చిందా నీకు అసురుతాడు. ఇంతలో నే తులసి అక్కడికి వచ్చి అభి ఈ ఇంటి పెద్ద అభిని ఎవరు ఏమీ అనద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి. మరొకవైపు నందు కోపంతో వచ్చి ఆ షర్టు విప్పేయగా లాస్య వచ్చి నందు ని మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. అలా వారిద్దరూ జరిగిన విషయం గురించి వాదించుకుంటూ ఉంటారు. ఇక జరిగిన విషయం గురించి లాస్య నందు పై విరుచుకుపడుతూ ఉంటుంది.

ఆ తరువాత తులసి పనిచేసుకుంటూ ఉండగా ఇంతలో దీపక్ అక్కడికి వచ్చి నీకు కోపం రాలేదా అక్క అని అడగగా వెంటనే తులసి అభికి అక్కడ జరిగింది తప్పు అనిపించింది. వాడు ఆ సమయంలో అలా మాట్లాడుతాడు అని నేను ఊహించలేదు అంటూ బాధపడుతుంది తులసి. ఇంతలోనే నందు లాస్య లు అక్కడికి వస్తారు.

Read Also : Intinti Gruhalakshmi Aug 30 Today Episode : తులసి మాజీ భర్త నందునే అని తెలుసుకున్న సామ్రాట్.. షాక్ లో లాస్య..?

, , , , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel