Guppedantha Manasu : జగతి తెచ్చిన డ్రెస్ అంటూ దేవయాని పెట్టిన చిచ్చు.. కోపంలో రిషి!

Guppedantha Manasu Feb 4 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకీ మరింత ఆసక్తిగా మారుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం ప్రేక్షకులను ఎలా మెప్పించనుందో చూద్దాం. ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తూ ఉండగా వసు మాత్రం తినకుండా ఉంటుంది. దాంతో రిషి, వసును నా పక్కన కూర్చో అని అంటాడు.

Advertisement
Guppedantha Manasu Feb 4 Episode Today
Guppedantha Manasu Feb 4 Episode Today

దానికి వసుధార కూడా ఏ మాత్రం సందేహించకుండా కూర్చుంటుంది. ఇక మహేంద్ర వీరిద్దరి మధ్య లవ్ ఉంది అని జగతి తో గుసగుసలాడుతాడు. ఇక భోజనం చేస్తున్న క్రమంలో ఇలా అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తూ ఉంటే.. వసు స్టూడెంట్ లా, జగతి మేడం కాలేజ్ స్టాప్ లా అసలు అనిపించడం లేదు’ అని గౌతమ్ అంటాడు.

Advertisement

ఆ మాటతో అందరూ షాక్ అవుతారు. వెంటనే చుట్టం లా అనిపిస్తున్నారని గౌతమ్ చెప్పగా.. దాంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. అలా సరదాగా గౌతమ్ వీరందరిలో నీకు ఎవరి డ్రెస్ నచ్చింది అని అడుగుతాడు. వెంటనే దేవయాని డ్రస్ నచ్చిందని రిషి అనడంతో దేవయాని ఎంతో ఆనందం పడుతుంది.

Advertisement

కానీ గౌతమ్ నాకు మాత్రం ‘రిషి డ్రెస్ ఏ నచ్చింది’ అని చెబుతాడు. ఆ మాటతో జగతి ఎంతో ఆనంద పడుతుంది. ఇంతకీ ఈ డ్రెస్ సెలక్షన్ ఎవరిది అని గౌతమ్ అడుగుతాడు. ఇక అవకాశం దొరికే సరికి దేవయాని జగతి సెలక్షన్ అని చెబుతుంది. ఇక రిషి కోపంతో రగిలిపోతాడు.

Advertisement

Guppedantha Manasu Feb 4 Episode Today : కోపంలో రిషి.. ఏం చేయబోతున్నాడో.. ఈ రోజు ఎపిసోడ్ ట్విస్ట్..

కానీ వసు కు ఇచ్చిన మాటకోసం కోపాన్ని మనసులోనే దాచుకుంటాడు. ఆ తర్వాత మహేంద్ర, జగతిలు జంటగా నడుచుకుంటూ వస్తారు. అది చూసిన దేవయాని జీర్ణించుకోలేక జగతిని మాటలతో గాయపరచాలని చూస్తుంది. దాంతో మహేంద్ర దేవయానితో భయపడాల్సిన అవసరం లేదు అంటూ ధైర్యంగా చెబుతాడు.

Advertisement

ఆ తర్వాత జగతి కూడా దేవయాని మాటలకు అసహనం వ్యక్తం చేసి ‘మహేంద్ర నాకు తాళి కట్టిన భర్త ఈ ఇంటికి రావడం నా హక్కు’ అని దేవయాని నోరు మూయిస్తుంది. అదే సమయంలో రిషి రావటంతో దేవయాని గురించి జగతి ఏదో విషయం చెప్పడానికి ప్రయత్నిస్తోంది.

Advertisement

దాంతో దేవయాని తెగ టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. తరువాయి భాగం లో వసు దగ్గరికి రిషి వచ్చి కాసేపు తనతో మాట్లాడి తనతో పాటు గాలిలో లైట్ బెలూన్ ఎగురవేస్తాడు. ఇక అదే సమయంలో రిషి బట్టల విషయాన్ని గుర్తు చేసుకొని.. ఎందుకు ఈ విషయంలో అబద్ధం చెప్పావు అని ప్రశ్నిస్తాడు.

Advertisement

Read Also : Guppedantha Manasu : రిషికి ట్విస్ట్ ఇచ్చిన వసు.. ఏకంగా జగతిని అమ్మా అని పిలవాలి అంటూ! 

Advertisement
Advertisement