Nuvvu Nenu Prema Serial July 20 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా పద్మావతి కి కళ్ళు తిరగడం చూసిన విక్రమాదిత్య ఆమె దగ్గరకు వచ్చి పట్టుకుంటాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. విక్రమాదిత్య ఫోన్ పట్టుకొని వాళ్ల బావకి ట్రై చేస్తాడు. అప్పుడు అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతను అక్కడి నుండి లోపలకి వస్తాడు. పద్మావతి అక్క ఒక్కటే దీపాలు పెడుతుంది అంటూ లోపలికి వెళ్తుంది. మెట్లు ఎక్కుతుంటే పద్మావతికి కళ్ళు తిరుగుతాయి. అది చూసిన విక్రమాదిత్య తన దగ్గరికి వచ్చి ఎత్తుకొని పైకి తీసుకుని వెళ్తాడు. అను గుడిలో దీపం పెడుతుంది. ఆ దీపం ఆరి పోతుంటే అను మరియు ఆర్య లు దీపం ఆరిపోకుండా చేతులను అడ్డు పెడతారు. అను అక్కడి నుండి వెళ్లిపోతుంది.

అప్పుడు ఆర్య నన్ను చూసి నవ్వింది.. అంటే తనకు నా మీద కోపం పోయినట్టే నా స్వీట్ హార్ట్ నన్ను క్షమించినట్లే.. ఇక నా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ దొరికినట్లు అనుకుంటూ సంతోష పడతాడు. అప్పుడు అరవింద అతన్ని చూస్తుంది. నువ్వు ఇష్టపడే అమ్మాయి తనే నా అంటుంది. అప్పుడు ఆర్య అవును తనే అంటాడు. నీ ప్రేమ సక్సెస్ కావాలని నేను కూడా ఆ దేవుని ప్రార్థిస్తాను. నువ్వు చెప్పు.. అనేంతవరకు నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పను అయినా విక్కీ ఎక్కడ అని అడుగుతుంది అరవింద. అక్కడ విక్కీ లేకపోవడంతో అరవింద, ఆర్యలు గుడిలోకి వెళతారు. విక్రమాదిత్య స్పృహ కోల్పోయిన పద్మావతినీ కూర్చోబెట్టి ఆమె మొహంపై నీళ్లు జల్లి ఆమెకు నీళ్లు తాగిస్తాడు. అప్పుడు పద్మావతి లేచి నువ్వు నాకు నీళ్లు ఇచ్చావా అంటూ నా ఉపవాస దీక్ష చెడగొట్టారు.. మీరు ఇదంతా కావాలనే చేస్తున్నారు అంటుంది.
Nuvvu Nenu Prema Serial : నేను అలాంటి వాడిని కాదు.. చేతకానప్పుడు ఉపవాసాలు ఎందుకన్న విక్రమ్..
నా మీద ఎప్పుడు ఎప్పుడు పగ తీర్చుకోవాలని చూస్తారు ఉంటుంది పద్మావతి. అప్పుడు విక్కీ నేను అలాంటి వాడిని అయితే నిన్ను కాపాడే వాడిని కాదు.. నాకు అలాంటి ఉద్దేశం లేదు అంటాడు. అయినా చేత కానప్పుడు ఇలాంటి ఉపవాసాలు చేయడం ఎందుకు అనగానే మా ఆడవాళ్ళ కష్టాలు మీకేం తెలుసు మంచి భర్త రావాలంటే ఇలాంటి ఉపవాసాలు చేయాలి అంటుంది. పద్మావతి కోపంతో అక్కడనుండి వెళ్తుంటే మళ్లీ కళ్ళు తిరుగుతాయి. అప్పుడు విక్రమాదిత్య తనని పట్టుకుంటాడు. చూసావా నేను పట్టుకోకపోతే నువ్వు ఇప్పుడు కూడా పడిపోయే దానివి ముందు మనుషుల్ని అర్థం చేసుకోవడం నేర్చుకో అప్పుడే అపార్ధాలు అనుమానాలు తొలగిపోతాయి అంటాడు.

అరవింద వాళ్ల పిన్ని పూజ పూజ మొదలు పెడదాం అనగానే ఆయన ఇంకా రాలేదు పిన్ని ఆయన వచ్చాక నేను పూజ చేస్తాను అంటుంది అరవింద. పదండి పిన్ని మీ కాళ్ళకి పసుపు రాస్తాను అనగానే వద్దు అంటుంది. కాళ్ళకి పసుపు రాయడం అనేది సాంప్రదాయం వద్దు అనకూడదు అని చెప్పి ఆమె కాళ్ళకు పసుపు రాస్తుంది. అక్కడికి వచ్చిన అను నీ కూడా పిలిచి రండి కూర్చోండి అంటు అను కాళ్ళకి పసుపు రాస్తుంది. అక్కడే ఉన్న ఆర్య మా ఇంటి ఆడపడుచు నా స్వీట్ హార్ట్ కి పసుపు రాసి మాకు త్వరగా పెళ్లి కావాలని కోరుకుంటుంది. దేవుడా ఇది జరిగేలా చూడు అంటాడు. పద్మావతి, విక్కీలు కూడా అక్కడికి వస్తారు.

అరవింద మీ బావగారికి కాల్ చేసావా వస్తున్నాడా అని విక్కీనీ అడుగుతుంది. అప్పుడు విక్కీ అక్క బావ కాల్ కలవట్లేదు వస్తాడులే అని చెప్తాడు. అప్పుడు అరవింద వాళ్ల పిన్ని అరవిందతో మాయని పిలిచావుగా ఇంకా రాలేదు ఏంటి అంటుంది. అప్పుడు మాయ అక్కడికి వస్తుంది. మాయ నీ చూసి అను ఎవరు తను అని అడుగుతుంది. అప్పుడు పద్మావతి విక్కీ వాళ్ల గర్ల్ ఫ్రెండ్ అంటుంది. మాయ తను కూడా ఉపవాసం ఉన్నానని వ్రతం చేస్తానని అరవిందతో చెప్తుంది. అరవింద పద్మావతి నీ కూడా పిలిచి తన కాళ్ళకి కూడా పసుపు రాస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో భాగంగా ఏం జరుగుతుందో చూద్దాం.