Nuvvu Nenu Prema Serial July 19 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. గత ఎపిసోడ్ లో పద్మావతి విక్కీలు గుడిలో కలుసుకుంటారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరగబోతుందో తెలుసుకుందాం. పద్మావతి విక్రమాదిత్యపై నువ్వు నాకు కనపడవద్దని అంటుంది. అయినా నేను వచ్చింది నిన్ను చూడడానికి కాదు.. దేవుని చూడడానికి అంటూ అక్కడి నుండి వెళ్ళి పోతుంది. అప్పుడు విక్కీ తన కోపంలో నిజముంది.. కానీ నేను వచ్చింది.. నీకు సారీ చెప్పడానికి పద్మావతి అని తన మదిలో అనుకుంటూ ఉంటాడు.

ఇక అను, ఆర్య గుడిలో మాట్లాడుకుంటూ ఉంటారు. పద్మావతి అక్కడికి వచ్చి ఏంటి ఆర్య సార్ మా అక్కని ఫాలో అవుతున్నారా అంటూ ఏం లేదులే జోక్ చేశాను అని చెప్తుంది. ఆర్య మరియు అను లు పద్మావతి ఒంటిపై ఉన్న రంగులను చూసి ఏమైంది అని అడుగుతారు. అప్పుడు పద్మావతి రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు ఉన్నాడుగా ఆ టెంపర్ గాడు అంటుంది. అప్పుడు అను ఏమైనా అన్నాడా అనగానే పద్మావతి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను అంటుంది. వాళ్లతో ఆర్య అసలు ఆ టెంపర్ గాడు ఎవరో కాదు మా అన్నయ్య అని చెప్పాలనుకుంటాడు. కానీ పద్మావతి అసలు విషయం చెప్పనివ్వకుండా వాళ్ళ అక్కని తీసుకుని గుడి లోకి వెళుతుంది.
అరవింద మరియు అరవింద వాళ్ల పిన్ని గుడిలో ఉంటారు. విక్కీ వాళ్ల దగ్గరికి వస్తాడు. అప్పుడు అరవింద విక్కీ డ్రెస్ పై పడిన పసుపు కుంకుమ ను చూసి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు విక్కీ మీరు పలికి వెళ్లండి అక్క అని అంటాడు. అప్పుడు అరవింద ఈ అక్క సంతోషమే నీకు ముఖ్యం అని చెప్పావు కదా నువ్వు కూడా లోపలికి రా అని విక్కీ నీ తీసుకొని చెట్టు దగ్గరికి ముడుపు కట్టడానికి వెళుతుంది. అక్కడికి పద్మావతి మరియు అను లు కూడా ముడుపు కట్టడానికి వస్తారు. పద్మావతి అను తో నీకు మంచి భర్త రావాలి నువ్వు ఎప్పుడు పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలి అని మొక్కుకొని ముడుపు కట్టు అని చెప్తుంది. ఈ విధంగా ఒకరి గురించి ఒకరు మొక్కుకొని ముడుపు కడతారు.
Nuvvu Nenu Prema Serial July 19 Today Episode : విక్రమాధిత్యకు మంచి భార్య రావాలని ముడుపు కట్టిన అరవింద..
అక్కడికి వచ్చిన అరవింద కూడా విక్కికి మంచి భార్య రావాలి అని తలచుకొని ముడుపు కడుతుంది. అరవింద కట్టిన ముడుపు పడిపోతుంటే అది చూసిన పద్మావతి అక్కడికి వచ్చి దాన్ని పడిపోకుండా పట్టు కుంటుంది. అప్పుడు అరవింద థాంక్స్ పద్మావతి నువ్వు ముడుపు పట్టుకోకపోతే నా కోరిక అలాగే పోయేది అని అంటుంది. అప్పుడు పద్మావతి మీలాంటి మంచి వారి కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి అంటూ తన చేతిలో ఉన్న ముడుపు ను అరవింద కి ఇస్తుంది. అప్పుడు అరవింద మళ్లీ తన ముడుపు ని చెట్టు కి కడుతుంది.

అప్పుడు అరవింద పద్మావతి ని చూసి నిన్ను చూసినప్పుడల్లా మా ఇంట్లో మనిషివే అని అనిపిస్తుంది. అప్పుడు పద్మావతి అది అంతా మీ అభిమానం అండి అని అంటుంది. వెంటనే అరవింద వాళ్ల పిన్ని తనకి ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలియదు అని అంటుంది. అరవింద విక్కీ మరియు పద్మావతిలపై పడిన పసుపు కుంకుమలను చూసి మీరిద్దరూ మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా అని అడుగుతుంది. సరే నువ్వు ముడుపు కట్టడానికి వచ్చావా అనగానే నేను మా అక్క వచ్చాము అని పద్మావతి సమాధానం చెబుతుంది. అప్పుడు పద్మావతి వాళ్ళ అక్క అను ని అరవింద కి పరిచయం చేస్తుంది. అప్పుడు అను నేను మీతో ఫోన్లో అలా మాట్లాడాల్సి ఉండేది కాదు.
పర్లేదు పరిస్థితులు అలాంటివి అంటుంది అరవింద అయినా మీరు పద్మావతి గురించి ఏమి భయపడవద్దు తను చాలా ధైర్యవంతురాలు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి తనకు ఉంది అని అంటుంది అరవింద తర్వాత వాళ్ళ పిన్ని పూజకు టైం అవుతుంది వెళ్దామా అనగానే అరవింద ఆర్య ఎక్కడికి వెళ్ళాడు అని అంటుంది. అప్పుడు వాళ్ళ పిన్ని ఏదో ఫోన్ వచ్చిందని బయటికి వెళ్లాడు అని చెప్తుంది. అది విన్న పద్మావతి ఆర్య ఎవరు అని అడగగా అతను మా తమ్ముడ మా తమ్ముడు అని చెప్తుంది అరవింద. అప్పుడు వాళ్ళ పిన్ని వాడు నా కొడుకు అదిగో వస్తున్నాడు అని ఆర్య వైపు చూపిస్తుంది. అక్కడికి వచ్చిన ఆర్యను చూపించి అరవింద పద్మావతి మరియు అను లకు పరిచయం చేస్తుంది.
ఇక అందరూ కలిసి గుడిలోకి వెళతారు. అక్కడ ఆర్య పద్మావతి మరియు అను లతో మీకు విక్రమాదిత్య మా అన్నయ్య అనే విషయం చెప్పకపోవడం నా తప్పే కానీ నేను మిమ్మల్ని చీట్ చేయాలని కానీ హర్ట్ చేయాలని కానీ అనుకోలేదు అని వాళ్లతో అంటాడు. అప్పుడు పద్మావతి తను మీ అన్నయ్య కదా నన్ను ఆ విధంగా ఇబ్బంది పెడుతుంటే మీరు అతనికి చెప్పొద్దా అని అంటుంది. తను మా అన్నయ్య అయినప్పటికీ ఆఫీసులో నేను కూడా మీలాగే ఒక ఎంప్లాయి నీ తనని కాదని రైట్ నాకు లేదు.
మా అన్నయ్య చెడ్డవాడు కాదు… అయినా వాడు నాకు టెంపరోడే..!
మీరు అనుకుంటున్నట్టు మా అన్నయ్య చెడ్డవాడు కాదు తనను మీరు ఒక వైపు మాత్రమే చూశారు ఇంకో వైపు చూస్తే మీరు తన గురించి అలా అనుకోరు అని అంటాడు. అప్పుడు పద్మావతి మీరు ఎన్ని చెప్పినా అతను నాకు టెంపర్ వాడే అని అంటుంది. అప్పుడు ఆర్య సరే మీకు ఈ పరిస్థితిలో ఎన్ని చెప్పినా అర్థం కాదు కానీ నేను ఈ నిజాన్ని దాచడం వెనుక నాకు ఎలాంటి దురుద్దేశం లేదు కేవలం ఇలాంటి మంచి మనుషులతో ఉన్న పరిచయం దూరం కాకూడదని చెప్పలేదు నన్ను క్షమించండి అంటూ అక్కడి నుండి వెళ్ళి పోతాడు.
పద్మావతి వాళ్ళ అక్క తో ఆర్య సార్ తను చేసిన తప్పును తెలుసుకొని సారీ చెప్తున్నాడు. అదే ఆ టెంపర్ వాడు అయితే తప్పు అతను చేసిన మనల్ని అంటాడు. ఇద్దరు అన్నదమ్ములు అయినప్పటికీ ఆర్య సార్ చాలా మంచివాడు అందుకే నాకు సహాయం చేస్తున్నాడు. తను చేసుకునే అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు అంటుంది వాళ్ళ అక్క తోఅరవింద మరియు విక్కీ లు గుడి బయట నిలబడతారు. అప్పుడు అరవింద ఫోన్ లో టైం చూసుకుంటూ ఏంటి మీ బావగారు ఇంకా రాలేదు ఈ టైం కె వచ్చేసి ఉండాలి కదా అని అంటుంది.

అప్పుడు వాళ్ళ పిన్ని ఈసారి కూడా పిన్ని ఈసారి కూడా హ్యాండ్ ఇస్తాడేమో అంటుంది. తన మాటలకు అరవింద బాధపడుతూ ఉంటుంది. అప్పుడు విక్కీ అక్క వర్క్స్ అన్ని ఫినీష్ చేసుకొని రావడానికి బావకి టైం పడుతుంది పద మనం లోపలికి వెళ్దాం అంటాడు. మీరు వెళ్ళండి.. నేను బావ వచ్చాక వస్తాను అంటుంది అరవింద. అప్పుడు విక్కీ అక్క నువ్వు వెళ్లి పూజ పనులు చూసుకో నేను బావకి కాల్ చేసి వస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆర్య వాళ్ళ అక్కని తీసుకుని గుడిలోకి వెళ్తాడు.
పద్మావతి వాళ్ళ అక్కతో అక్క ఈ ఉపవాసం నావల్ల కాదు ఏమైనా తిందామా అంటుంది. అప్పుడు వాళ్ళ అక్క తప్పు అమ్మి అలా చేయకూడదు అంటుంది అప్పుడు పద్మావతి సరే నువ్వు వెళ్ళు నేను కొంచెం సేపు కూర్చొని వస్తాను అంటుంది వాళ్ళ అక్క తో వాళ్ళ అక్క ఈ సాకుతో ఏమైనా తిందాం అనుకుంటున్నావా అనగానే పద్మావతి మాటంటే మాటే ఎప్పటికీ మాట తప్పదు అంటుంది. అప్పుడు వాళ్ళ అక్క సరే నేను వెళ్తున్నాను నెమ్మదిగా వచ్చేయ్ అంటుంది. అప్పుడు విక్కీ గుడిలోకి వస్తుంటాడు ఆ టైంలో పద్మావతి కి కళ్ళు తిరగడం చూసి ఆమె దగ్గరికి వచ్చి పడిపోకుండా ఆమెను పట్టుకుంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూద్దాం.