Nuvvu Nenu Prema Serial Aug 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా పద్మావతి కి బిజినెస్ పెట్టడానికి ఒక ఐడియా వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూద్దాం. అను బాబాయ్ మా పద్మావతి వంట చూశారు కదా దాబా లోనే వంట మాస్టర్ గా కుదుర్చుకోండి మేము కూడా నీకు హెల్ప్ చేస్తాము అంటుంది. అప్పుడు ఆ బాబాయ్ మీరు నా దగ్గర పని చేస్తే ఏ 10000 లో 15000 లో వస్తాయి. సిటీ కాబట్టి హోమ్ ఫుడ్ డెలివరీ కి మంచి ప్రాధాన్యత ఉంది. అదే మీరు బయటికి వెళ్లి ఆర్డర్స్ తీసుకుంటే మీకు మంచి లాభం వస్తుంది. ఇక మీకు తోడుగా మీ అత్తయ్య కూడా మీకు హెల్ప్ చేస్తుంది అంటాడు. ఇక పది వేలు ఏంటి లక్షలు సంపాదించవచ్చు అంటాడు.
దీనికి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు నాకు తెలిసిన ఒక టెస్ట్ ఉంది. అది మన లాంటి వాళ్ళకి చాలా సహాయ పడుతుంది. నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అంటాడు. ఇక పద్మావతి అక్క ఈ విషయం వెంటనే మన అమ్మానాన్న కి అత్త కి చెప్పాలి పదా అంటుంది. ఇక విక్కీ తన రూం లో కూర్చుని పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అరవింద మరియు కృష్ణ అక్కడికి వస్తారు. అరవింద ఏంటి మాయ వచ్చిన సంతోషం నీలో కనిపించడం లేదు అంటుంది. అప్పుడు విక్కీ నానమ్మకి మాయ రావడం ఇష్టం లేదు కదా తను ఏం చేసినా నానమ్మకు నచ్చదు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా ఇక నానమ్మ ఆలోచనలు వేరుగా ఉంటాయి అంటాడు. అప్పుడు అరవింద మాయ ఇక్కడ ఉండడం వల్ల నానమ్మకి ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా అనగానే కృష్ణ ఎవరో ఒకరు ముందుకు వెళితేనే అన్ని సమస్యలు దాటుతాయి.
ఇప్పటికి మీ అక్క నా వల్ల చాలా బాధపడింది. ఇప్పుడు తననీ సంతోషంగా ఉంచడం నా బాధ్యత అంటాడు. అప్పుడు అరవింద బావగారు ఏం చేసినా మన సంతోషం కోసమే అంటుంది. కృష్ణ విక్కీ రేపు మనం అందరం కలిసి లంచ్ కి బయటికి వెళ్దాం అంటాడు. అప్పుడు విక్కీ ఓకే బావ నాకు పని ఉంది అని చెప్పి బయటికి వెళ్తాడు. ఇక పద్మావతి సంతోషంతో అత్త ఇవాళ బజ్జీలు చేసుకుందాం అంటుంది. అప్పుడు వాళ్ళ అత్త ఇలాంటి మంచి ఐడియా ఇచ్చినందుకు బజ్జీల తోపాటు స్వీట్స్ కూడా చేసుకుందాం అంటుంది. ఈ రోజుల్లో చాలామంది క్యాటరింగ్ మీద ఆధార పడుతున్నారు. ఇప్పుడు మనం ఆ బిజినెస్ చేయడం వలన మనకు మంచి లాభాలు వస్తాయి అంటుంది.
పద్మావతి వాళ్ళ అమ్మ కూర్చుని బాధపడుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి ఏమైంది పార్వతి ఎందుకు అలా ఉన్నావ్ అంటాడు. నువ్వు పొద్దున్నుంచి ఏమీ తినలేదు రా కొంచెం అన్నమైన తిందువు అంటాడు. నాకు ఆకలిగా లేదు అండి ఉన్నంతలోనే ఇప్పటివరకు చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు అప్పులు పాలు చేసి అన్ని పోగొట్టుకుని పరిస్థితి వచ్చింది. పెద్దమ్మాయి కి కట్నం ఇవ్వలేదని చెప్పి పెళ్లి ఆపేశారు.
ఇప్పుడు అమ్మాయిల పెళ్లి గురించి ఆలోచిస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక అప్పుల వాళ్లు ఇంటికి వస్తుంటే ముద్ద ఎలా దిగుతుందని అంటుంది. పిల్లల బాధ్యత చూసుకోవడానికి వాళ్ళ నాన్ననీ నేను ఉన్నాను. వాళ్ల బాధ్యత నేను ఎట్లా మర్చిపోతాను చెప్పు ఈ ఇల్లు అమ్మయినా వాళ్ల పెళ్లిళ్లు ఘనంగా చేస్తాను. ఇక తర్వాత మనం బ్రతకడానికి ఒక చిన్న ఉద్యోగం కూడా దొరకదా అన్నిటికి వెంకన్న స్వామి ఉన్నాడు అని ధైర్యం చెప్తాడు.
Nuvvu Nenu Prema Serial Aug 3 Today Episode : పాత కోపంతో విక్రమాదిత్య మాటల్ని తిప్పికొట్టిన పద్మావతి..
ఇక పద్మావతి వాళ్ళ అమ్మ నాన్న కి అసలు విషయం చెప్పడానికి కాల్ చేద్దామని అనుకుంటుంది. ఇక తన ఫోన్ పగిలిపోయింది అని గుర్తుకొచ్చి వాళ్ళ అక్క ఫోన్ తో కాల్ చేస్తుంది. నాన్న మేము తిరుపతి కి రావడం లేదు ఇక్కడే ఉండి క్యాటరింగ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ క్యాటరింగ్ కి మంచి గిరాకీ ఉంది. ఇక మన బిజినెస్ ని ఓ రేంజ్ లో తీసుకెళ్తాను. మన కష్టాలు అన్ని తీరిపోతాయి అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న బిజినెస్ అంటే ఒకటి రెండు సార్లు ఆలోచించి చేయాలి అంటాడు. సరే నాన్న అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న చూసావా పార్వతి మనం పిల్లల గురించి ఆలోచిస్తుంటే పిల్లలు మన గురించి ఆలోచిస్తున్నారు. ఇలాంటి పిల్లలు ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులం అంటాడు.
ఇక ఆర్య తన ఫోన్లో అను ఫోటోలు చూస్తూ తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా నా ప్రేమకి విక్కీ వల్ల బ్రేక్ పడుతుందని అనుకోలేదు. ఇప్పటికే తను తిరుపతి వెళ్ళి ఉంటుంది. కాల్ చేద్దామా అనుకుంటాడు. మళ్లీ తను ఏమైనా అనుకుంటాదేమో అని పద్మావతికి కాల్ చేసి చూస్తాడు. అప్పుడు పద్మావతి కాల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక అను కి కాల్ చేస్తాడు. ఏంటండీ మీరు చెప్పాపెట్టకుండా తిరుపతికి వెళ్లారు అంటాడు.
అప్పుడు అను మీకు ఎందుకు చెప్పాలి అయినా నీకెలా తెలుసు మేము తిరుపతికి వెళ్ళామని అంటుంది. అప్పుడు ఆర్య మార్నింగ్ మీ ఇంటికి వచ్చాను మీరు అక్కడ లేరు అడిగితే తిరుపతి వెళ్లారు అని చెప్పాడు అనగానే అను మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాము అంటుంది. అప్పుడు ఆర్య సంతోషంతో యాహూ అని గట్టిగా అరుస్తాడు. మీకెందుకండీ అంత సంతోషం అనగానే మన పరిచయం ఫ్రెండ్షిప్ గా మార్చుకోవచ్చు కదా అంటాడు.
నాకెందుకు కాల్ చేశారు అని అను అనగానే నేను పద్మావతితో మాట్లాడదామని చేశాను తనకి చేస్తే తన ఫోన్ స్విచాఫ్ వస్తుంది. అందుకే నీకు చేశాను అంటాడు. అయితే మా చెల్లి తోనే మాట్లాడండి అంటూ పద్మావతి కి ఫోన్ ఇస్తుంది. ఇక పద్మావతి ఫోన్ తీసుకొని క్యాటరింగ్ విషయం గురించి ఆర్యకి చెబుతుంది. నన్ను తక్కువ చేసి చూసిన వాళ్ల సంగతి చూడాలని ఈ నిర్ణయం తీసుకున్నాను అంటుంది. ఆర్య సార్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు చెప్పండి.
అద్భుతమైన తిరుపతి వంటకాలతో రుచి చూపిస్తాము అంటుంది. అప్పుడు ఆర్య తప్పకుండా చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక పద్మావతి తన బిజినెస్ గురించి ఆలోచిస్తూ సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అత్త ఇంకా స్టార్ట్ చేయలేదు నువ్వు అప్పుడే సక్సెస్ గురించి కలలు కంటనావు అంటుంది. సరే మీరు వెళ్లి వంట చేయండి అనగానే పద్మావతి మరియు అను లు వంట చేయడానికి ఇంట్లో కి వెళ్తారు.
హోటల్ బాబాయ్ పద్మావతి వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు వాళ్ళ అత్త హే ఏంటి నేరుగా ఇంట్లోకి వస్తున్నావు అంటుంది. పద్మావతి బేటీ కోసం వచ్చాను అంటాడు. అప్పుడు ఆమె పద్మావతిని పిలుస్తుంది. ఏంటి అంకుల్ ఇలా వచ్చారు అనగానే నాకు తెలిసిన ఒకతను రెస్టారెంట్లో ఆర్డర్ తీసుకొని బయటికి క్యాటరింగ్ చేస్తాడు. ఒకసారి నువ్వు వెళ్ళి ఆ మేనేజర్ ని కలిస్తే నీకు కూడా ఏమైనా పని దొరుకుతుందేమో అంటాడు. అప్పుడు పద్మావతి చాలా థాంక్స్ అంకుల్ అంటుంది. థాంక్స్ ఎందుకు బేటీ మనం మనం ఒకటి అంటాడు. అప్పుడు వాళ్ళ అత్త ఏ ఇంకోసారి ఆ మాట అన్నావు అంటే నిన్ను చంపేస్తాను అంటుంది. ఇక రేపు ఏం జరగబోతుందో చూడాలి.