Guppedantha Manasu : జగతిని కోరుకుంటున్న మహేంద్ర వర్మ.. పర్సనల్ విషయం అంటూ వసుతో ఓపెన్ అయిన రిషి!

Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దేవయాని ఇంటి నుంచి కారులో తిరిగి వెళుతున్న క్రమంలో జగతి ‘అవకాశం ఉన్నప్పుడు కాదు. ఆహ్వానం ఉన్నప్పుడే ఆ ఇంటి గడప తొక్కుతాను. అది గడప కాదు సీతారాములను విడదీసిన లక్ష్మణరేఖ’ అని వసుధార కు చెబుతుంది.

మరోవైపు మహేంద్ర ను దగ్గరుండి చూసుకుంటున్న రిషిహేం మద్ర తో ఇలా అంటాడు. ‘డాడ్ నేను మీ దగ్గరే ఉంటాను. మీతోనే పడుకుంటాను’ అని ఎమోషనల్ గా చెబుతాడు. ఇక మహేంద్ర ‘నాకు ఏమీ కాదు రిషి నువ్వు అనవసరంగా భయపడకు’ అని అంటాడు. అలా తండ్రి కొడుకులు కొద్దిసేపు ఎమోషనల్ గా మాట్లాడుకుంటారు.

ఆ తర్వాత రిషి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటానని.. మహేంద్ర ఒడిలో చిన్నపిల్లాడిలా పడుకుంటాడు. దానికి మహేంద్ర.. రిషి ఏంటి నాన్న అని బుజ్జగిస్తాడు. మరో వైపు జగతి అన్నం తినకుండా మహేంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మహేంద్ర బాగోగులు తెలుసుకోవడానికి వసుధార మహేంద్ర ఫోన్ కి కాల్ చేయగా.. మహేంద్ర పక్కనే ఉన్న రిషి.. ఫోన్ లిఫ్ట్ చేసి ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు.

ఆ తర్వాత రిషికి ఏమవుతుందో గాని.. అడక్కుండానే వసుధార కు వీడియో కాల్ చేసి మహేంద్ర ను చూపిస్తాడు. ఇక రిషి మా డాడ్ క్షేమంగా, ఆరోగ్యంగానే ఉన్నాడు. మా డాడ్ కోసం కష్టపడిన వాళ్లందరికీ థాంక్స్ అని విరుచుకు పడతాడు. ఆ తర్వాత మా నాన్న ని నేను చూసుకోగలను అన్నట్టు మాట్లాడుతాడు. ఆ మాట జగతికి మరింత బాధను కలిగిస్తుంది.

ఇక అదే విధంగా రిషి నిద్రాహారాలు మానుకొని తన తండ్రి దగ్గరే ఉండిపోతాడు. మరోవైపు జగతి మహేంద్ర గురించి ఆలోచించు కొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రిషి ఎం డాడ్ నిద్ర పోవచ్చు కదా అని అడుగుతాడు. దానికి మహేంద్ర నిద్ర పోవాలి అంటే పట్టాలి కదా రిషి అని చెబుతాడు. దానికి రిషి, మీ మనసు ఎదో కోరుకుంటుంది డాడీ అని అంటాడు. దానికి మహేంద్ర.. జగతిని కోరుకుంటున్న అని అంటాడు. తరువాయి భాగంలో ఆ మాట విని రిషి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. వసుతో పర్సనల్ విషయం అంటూ ఏదో విషయం చెప్పాలనుకుంటాడు.

Read Also : Trending News : రీల్ సీన్ రియల్ లైఫ్‌లో రిపీట్… సిబ్బందికి షాక్ ఇచ్చిన రైతు !