Karthika Deepam September 8 serial Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప మోనితను ప్రమాణం చేయమనడంతో మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో దీప, నేను ఎటువంటి తప్పు చేయలేదు అని ప్రమాణం చేశాను కదా నువ్వు కూడా ప్రమాణం చెయ్యి అని చెప్పడంతో మోనిత ప్రమాణం చేయకుండా సాకులు చెబుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ కూడా ప్రమాణం చేయి మోనిత ఎందుకు దిక్కులు చూస్తున్నావు అని అంటాడు. అప్పుడు మోనిత అనే ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు అంటూ కార్తీక్ ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది.
మరొకవైపు కార్తీక్ మోనిత ఇద్దరూ కారులో వెళుతూ ఉండగా అప్పుడు మోనిత జరిగిన విషయాలను తెలుసుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. మొన్న అంకుల్ వాళ్ళు కనిపించారు నిన్న శౌర్య ఈరోజు వంటలక్క అందరూ ఒకే చోట ఉన్నారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఇప్పుడు కార్తీక్ ఆ వంటలక్క చేసింది తప్పఅనుకోవడం లేదు అనడంతో వెంటనే మోనిత కారు ఆపు కార్తీక్ అని చెప్పి కారు దిగిన తర్వాత ఇకపై ఆ వంట లెక్క ప్రస్తావని తీసుకురాకూడదు తన పేరు కానీ తన ఆలోచనలు కానీ రాకూడదు అలా అని నాకు మాట ఇవ్వు అని అంటుంది. దాంతో కార్తీక్ చిరాకు పడి నేను నీకు ఎందుకు మాట ఇవ్వాలి.
Karthika Deepam September 8 serial Today Episode : కోపంతో రగిలిపోతున్న మోనిత…
అయినా నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి. అంటూ మౌని దాని మీద గట్టిగా అరిచి మోనిత ను అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మరొకవైపు వారణాసి,సౌర్య ఇద్దరూ కలిసి బయట కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు సౌర్య తన గతాన్ని తలుచుకొని మరొకసారి బాధపడుతుంది. మరొకవైపు కార్తీక్ కార్లో వెళ్తూ మధ్యలోకి రాగానే అడ్రస్ మరిచిపోయి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఇక ఆ తర్వాత మోనిత ఆటోలో ఇంటికి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వారిని సార్ వచ్చారా అనడంతో వచ్చారు మేడం అని చెప్పగా అప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత నిదానంగా లోపలికి వెళ్లి చూడగా అక్కడ దీప డాక్టర్ బాబుకి సేవలు చేస్తుండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు మోనిత దగ్గరికి వెళ్ళగా వెంటనే దీప మాట్లాడకు అంటూ సైగలు చేస్తుంది.
ఇంతలో కార్తీక్ మోనితను చూసి వచ్చావా మోనిత అని అనగా మోనిత కార్తీక్, దీప లపై ఒక రేంజ్ లో విరుచుకుపడుతుంది. అప్పుడు కార్తీక్, దీప సపోర్ట్ గా మాట్లాడడంతో మోనిత మరింత కోపంతో రగిలిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో మోనిత వంటలక్క ని హగ్ చేసుకుని నా భర్తని కాపాడినందుకు థాంక్స్ అని చెబుతుంది. అప్పుడు దీప కూడా తన స్టైల్లో మోనిత కు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు దీప వెళ్తూ వెళ్తూ డాక్టర్ బాబు రేపు వినాయక చవితి తప్పకుండా రావాలి అని చెప్పడంతో తప్పకుండా వస్తాను వంటలక్క అని అంటాడు కార్తీక్.
Tufan9 Telugu News And Updates Breaking News All over World