Janaki Kalaganaledu june 24 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్ఞానాంబ కుటుంబం కాపాడి జానకి గాయపడుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో గాయపడిన జానకికి డాక్టర్ వచ్చి వైద్యం చేయడంతో అప్పుడు జానకికి మెలుకువ కావడంతో అందరూ ఒక్కసారిగా సంతోషంగా ఫీల్ అవుతారు. అప్పుడు రామచంద్ర మాత్రం ఎమోషనల్ గా మాట్లాడుతాడు. మీకు ఏదైనా అయితే నేను ఉండలేను జానకి గారు అని అనడంతో వెంటనే మల్లిక దొంగ ఏడుపులు ఏడుస్తూ తానే కాపాడినట్టుగా నటించడంతో పక్కనే ఉన్న విష్ణువు నీవల్లే వదినకు అలా జరిగింది.
నువ్వు శివుడికి అభిషేకం చేసిన నీళ్లు దారిలో పడి కరెంటు తీగ పడటం వల్ల ఒదినకు ఈ పరిస్థితి వచ్చింది అని అనడంతో మల్లిక అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకే వచ్చిందా అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞానాంబ,జానకిని రెస్ట్ తీసుకోమని చెప్పి అక్కడినుంచి అందర్నీ పంపిస్తుంది. ఆ తర్వాత రామచంద్ర ఎమోషనల్ అవుతూ జానకి తో మాట్లాడుతూ ఉంటాడు.
మీకు అలా జరిగినా అందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఊపిరి తీసుకోకుండా నైనా ఉండగలనేమో కానీ మీరు లేకుండా ఉండలేను అని అనటంతో అలా మాట్లాడకండి అని రామచంద్రకు ధైర్యం చెబుతుంది. అప్పుడు రామచంద్ర జానకి కాళ్ళు నొక్కుతూ జానకికి సేవలు చేస్తూ ఉంటాడు. మరొకవైపు మల్లిక లబోదిబోమని బాధపడుతూ కనిపింస్తుంది.
అప్పుడు విష్ణు అక్కడికి వెళ్లి ఏమైంది బంగారం అంటూ వెటకారంగా అనడంతో ఇదంతా నీ వల్లే జరిగింది అని మల్లిక విష్ణు ని బాగా కొడుతుంది. ఆ తర్వాత విష్ణు మల్లిక కాళ్లకు వేడి నీళ్ల కాపడం పెడతాడు. మరొకవైపు జానకి రామచంద్ర అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జ్ఞానాంబ వచ్చి జానకి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంది.
ఆ తర్వాత నీకు క్షమాపణలు చెప్పాలి అని అనటంతో జానకి ఆశ్చర్యపోతుంది. గతంలో జరిగిన అన్ని విషయాలలో నిన్ను అపార్థం చేసుకున్నాను. నువ్వు తోటి కోడలు కోసం ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చావు ఇలా ప్రతి విషయంలో కూడా నేను అపార్థం చేసుకున్నాను.
మొన్న వంటల ప్రోగ్రాం లో రామచంద్రను అవమానించిన వారికి నువ్వు గట్టిగా సమాధానం చెప్పావు నువ్వు నన్ను క్షమించాలి అని జానకి చేతులు పట్టుకొని క్షమాపణలు అడుగుతుంది జ్ఞానాంబ.
ఆ తరువాత రామచంద్ర భోజనం తీసుకుని రావడంతో నా కోడలికి నేనే భోజనం తినిపిస్తాను అని ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటుంది జ్ఞానాంబ. అది చూసి జ్ఞానాంబ కుటుంబం ఆనంద పడుతూ ఉండగా మల్లికా మాత్రం కుళ్ళు కుంటూ ఉంటుంది.