Janaki Kalaganaledu serial September 15 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్ఞానాంబ, లీలావతి మీద కోప్పడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో లీలావతి నేను మీ మంచి కోరే చెప్పాను కదా అని అక్కడ నుంచి వెళ్ళిపోగా అదే అదునుగా భావించిన మల్లిక అత్తయ్య గారు ఇప్పుడు ఈ పక్కింటి ఆమె నోరు మూయించాము ఊరందరి నోరు మూయించలేము కదా దీనికి అంతటికీ కారణం ఆ జానకి ఇన్ని తప్పులు చేస్తున్నా మీరు జానకిని ఎందుకు ఏమి అనడం లేదు అత్తయ్య ఇన్ని తప్పులకు గాను మీరు గీసిన గీతలో ఒక గీతను చెరిపేయండి అనడంతో జ్ఞానాంబ కోపంగా లోపలికి వెళుతుంది.

మరొకవైపు జానకి జరిగిన విషయాల గురించి తలచుకొని ఏదో పరధ్యానంలో ఉంటుంది. అప్పుడు రామచంద్ర ఎంత పిలిచినా పలకదు. ఏమైంది జానకి గారు ఎందుకు అలా ఉన్నారు అని అనగా వెంటనే జానకి ఈ గొడవల వల్ల నేను చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాను రామా గారు అని అంటుంది. మన వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతోంది అని అంటుంది.
ఇక ఆ మాటలు విన్న జ్ఞానాంబ జ్ఞానాంబ ఏం మాట్లాడుతున్నావ్ జానకి పరాయి అమ్మాయి కోసం నీ చదువుని పట్టించుకోకపోవడం ఏంటి. నాకు నిన్ను చదివించడం ఇష్టం లేకపోయినా కూడా చదివిస్తున్నాను అంటూ జానకి పై సీరియస్ అవుతుంది. అప్పుడు జ్ఞానాంబ నేను నిన్ను కాలేజ్ దగ్గర దింపుతాను అని అనగా వద్దులే అమ్మ నేను దింపుతాను అని అంటాడు రామచంద్ర.
మరొకవైపు అఖిల్ టెన్షన్ పడుతూ కనిపించగా ఇంతలో అక్కడికి వచ్చిన గోవిందరాజులు అఖిల్ టెన్షన్ పడుతూ ఉండటం చూసి ఎందుకు అఖిల్ నిజాన్ని అబద్ధమని చేస్తావు అని అనగా అఖిల్ మాత్రం లేదు నాన్న అంటూబుక ఇస్తూ ఉంటాడు. అప్పుడు గోవిందరాజులు ఎంత విధాలుగా చెప్పినా కూడా అఖిల్ నిజం ఒప్పుకోకుండా అబద్ధం చెప్పి అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు.
Janaki Kalaganaledu serial Sep 15 Today Episode : జెస్సి కి వార్నింగ్ అఖిల్..జెస్సి ఏ నిర్ణయం తీసుకోబోతోంది ?
ఆ తర్వాత రామచంద్ర జరిగిన విషయాల గురించి తలుచుకుని బాధపడుతూ ఉండగా ఇంతలో వెన్నెల అక్కడికి వచ్చి రామచంద్ర ను ఓదారిస్తుంది. ఆ తర్వాత జెస్సీ తన గదిలో ఒక్కతే తన తల్లిదండ్రులను బాధ పెడుతున్నాను అంటూ అఖిల్ ఫోటో చూసి ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలోనే అఖిల్ జెస్సి కి ఫోన్ చేస్తాడు.
అప్పుడు జెస్సి అఖిల్ ఏమైంది అక్క మన పెళ్లి గురించి ఆంటీ తో మాట్లాడిందా ఆంటీ మన పెళ్లికి ఒప్పుకుందా అని అనగా వెంటనే అఖిల్ కోపంతో ఎందుకు ఇలా చేస్తున్నావ్ జెస్సి నేను చెప్పిన విధంగా అబార్షన్ చేయించుకోమంటే నువ్వు వినలేదు. ఇప్పటికైనా ఏం పర్లేదు నువ్వు వెళ్లి అబార్షన్ చేయించుకుంటే పర్లేదు లేదంటే నేను శాశ్వతంగా వదిలేయాల్సి వస్తుంది అని జెసి కి వార్నింగ్ ఇస్తాడు అఖిల్.
దీంతో ఏం చేయాలో అర్థం కాక జెస్సి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు జెస్సి ఇలా మా మనల్ని బాధ పెట్టడం కంటే నేను చచ్చిపోవడం బెటర్ అని సూసైడ్ చేసుకోవడానికి వెళుతుంది. ఆ తర్వాత జానకి ఎక్సమ్ రాయడానికి లోపలికి వెళ్తూ ఉండగా ఇంతలోనే జెస్సి తల్లిదండ్రులు ఫోన్ చేసి జెస్సి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది అని చెబుతారు. జానకి షాక్ అవుతుంది.
Read Also : Janaki Kalaganaledu: అఖిల్ గురించి జ్ఞానాంబకు చెప్పిన జానకి..షాక్ లో జ్ఞానాంబ కుటుంబం..?
- Janaki Kalaganaledu: అఖిల్ పై కోపంతో రగిలిపోతున్న జ్ఞానాంబ..మనం భార్యాభర్తలు కాదు అంటూ అఖిల్ కు షాక్ ఇచ్చిన జెస్సి..?
- Janaki Kalaganaledu serial Oct 21 Today Episode : మల్లిక ప్లాన్ ను తిప్పి కొట్టిన జానకి.. బాధలో జ్ఞానాంబ..?
- Janaki Kalaganaledu july 1 Today Episode : మల్లికను ఆట పట్టించిన విష్ణు..మల్లికపై కోప్పడిన జ్ఞానాంబ..?













