Janaki Kalaganaledu March 9th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..జానకి తల్లి కాబోతోంది అన్న విషయాన్ని తెలుసుకున్న జ్ఞానాంబ దంపతులు సంతోషం లో మునిగి తేలుతున్నారు. అసలు విషయాన్ని జానకీ చెప్పినప్పటికీ అర్థం చేసుకోకుండా జ్ఞానాంబ దంపతులు గుడికి వెళతారు. ఇక వెంటనే జానకి రామ చంద్ర దగ్గరికి వెళ్లి రాత్రి తిన్న భోజనం అరగక వాంతులు చేసుకుంటే అత్తయ్య గారు పొరపాటు పడ్డారు అని చెబుతుంది.

దానితో రామచంద్ర ఏమిచేయాలో తెలియక ఆలోచనలో పడతాడు. మరొకవైపు చికిత జానకమ్మ నెల తప్పింది అంటూ మల్లిక నోట్లో స్వీట్ పెడుతుంది. ఆ వార్త విన్న మల్లిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు మల్లిక ఏడుస్తూ నేను కూడా ఒక మగ పిల్లాడిని కని మా అత్త పోలేరమ్మ ఆట కట్టించాలి అని మనసులో అనుకుంటుంది. మరొక వైపు జ్ఞానాంబ జానకి నెల తప్పింది అన్న విషయాన్ని ఊరంతా చెబుతూ స్వీట్లు పంచుతూ ఉంటుంది. జానకి రామచంద్ర లు బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఎదురైన లీలావతికి జ్ఞానాంబ దంపతులు చివాట్లు పెడతారు. మరొకవైపు రామచంద్ర, జానకి లు అసలు విషయాన్ని చెప్పడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ జ్ఞానాంబ దంపతులు ఆనందంలో వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వెళుతూ ఉంటారు.
దీనితో జానకీ కుమిలి పోతూ ఉంటుంది. ఇంతలో చికిత రామచంద్ర కి ఫోన్ చేసి అమ్మ గారు పిలుస్తున్నారు మీరిద్దరూ ఇంటికి రావాలి అని చెబుతుంది. ఒక జానకి, రామచంద్ర లు ఇంటికి రాగానే వారికి ఎన్నో జాగ్రత్తలు చెబుతుంది జ్ఞానాంబ. కడుపుతో ఉన్నవారు పులుపు తినాలి అనిపిస్తుందని జ్ఞానాంబ జానకి కోసం పులుపు వస్తువులు తెప్పిస్తుంది. అప్పుడు జానకి కి ఏం చేయాలో తోచక ఏడుస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
- Janaki Kalaganaledu May 27 Today Episode : జ్ఞానాంబ ఇంట్లో కన్నబాబు.. టెన్షన్ లో జానకి రామచంద్ర..?
- Janaki Kalaganaledu july 12 Today Episode : సంతోషంలో జ్ఞానాంబ కుటుంబం..జ్ఞానాంబకు ఇచ్చిన మాట తప్పిన జానకి,రామచంద్ర..?
- janaki kalaganaledu july 6 today episode : జానకికి కృతజ్ఞతలు చెప్పిన రామచంద్ర,జ్ఞానాంబ.. కుదుటపడిన గోవిందరాజులు ఆరోగ్యం..?















