Devatha May 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సూరి దేవుడమ్మ తో మాట్లాడుతూ రుక్మిణి గురించి అసలు విషయం చెప్పేస్తాడు.
ఈరోజు ఎపిసోడ్ లో సూరి అసలు నిజాన్ని చెప్పడంతో దేవుడమ్మ ఆనంద పడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే గతంలో స్వామీజీ చెప్పిన మాటలు తలుచుకొని ఆనందపడుతుంది. ఎలా అయినా సరే రుక్మిణిని వెతికి పట్టుకోవాలి అని అంటూ ఉండగా ఇంతలో సూరి తాను గతంలో ఒకసారి రుక్మిణి ని చూసిన విషయాన్ని తలుచుకుంటాడు.

తాను అప్పుడు చూసింది రుక్మిణి నా కాదా అని డౌట్ పడుతూ ఉంటాడు. మరొకవైపు రాధ చెట్టుకు పూలు కోస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే దేవి అక్కడికి వచ్చి పిల్లలు అందరూ సెలవులకు వారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం అని అనడంతో ఎక్కడికి వెళ్దాం అని అంటుంది రాద. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని దేవి అనటంతో రాధ వద్దు అని అంటుంది.
వెంటనే దేవి నాకు అమ్మమ్మ ఉందా లేదా అసలు నువ్వు మా అమ్మవి కావు అనడంతో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొక వైపు ఇంట్లో కూర్చొని మాధవ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి జానకి వచ్చి ఈ భార్య లక్ష్మి చనిపోయినప్పుడు ఎన్నో రోజులు నువ్వు చీకటి గది లోనే ఉన్నావు కానీ ఆ తర్వాత రాధ వచ్చిన తర్వాత నుంచి తీసుకుని బయట తిరుగుతున్నావు అని అంటుంది.
ఊరి ప్రజల కోసం నీ కోసం రాధ ఈ ఇంటి కోడలిగా ఉంటే బాగుండు అని జానకి అనగా అప్పుడు మాధవ, రాధ అంత సులువుగా ఒప్పుకోదు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో వారు మాటలను రాధ గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది. మరొక వైపు రాధ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పిల్లలు స్కూల్ కి వెళ్తూ లంచ్ బాక్సు అడగగా అప్పుడు రాధ తెచ్చి ఇస్తుంది. అప్పుడు ఇద్దరు పిల్లలు రాధకు ముద్దు పెట్టి స్కూల్ కి వెళ్తూ ఉంటారు.
కానీ దేవి మాత్రం పరాయి వాళ్ల తల్లితో ప్రవర్తించినట్లు గా ప్రవర్తిస్తుంది. అప్పుడు రాధ మరింత బాధ పడుతుంది. మరొకవైపు భాగ్యమ్మ స్కూల్ దగ్గరికి వచ్చి దేవి తో ఆడుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటుంది.
మరొకవైపు జానకి ఇంట్లో అందరిని బయలుదేరమని చెప్పి పొరుగూరికి తీసుకెళ్తుంది. అయితే ఇంట్లో అందరూ ఎక్కడికి ఎందుకు అని ఎంత అడిగినా కూడ చెప్పదు. రాధ ఏం చేస్తుందో తెలియక మాధవ ఆలోచిస్తూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha May 28 Today Episode : సత్య మాటలకు షాక్ అయిన దేవుడమ్మ, ఆదిత్య.. బాధలో రాధ..?