Zomato Delivery boy: తమ పిల్లలను కాపాడుకునేందుకు, కంటికి రెప్పలా కాచుకునేందుకు తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు అయనా పడతారు. తమ పిల్లలను ఉన్నత స్థానాల్లో చూసేందుకు ఎన్ని సమస్యలు అయినా ఎదుర్కుంటారు. అయితే అలాంటి ఓ సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసకోబోతున్నాం. ఓ జొమాటో డెలివరీ బాయ్.. తన కూతురుని భుజానికి కట్టుకొని.. కొడుకును చేతబట్టుకొని ఇంటింటికీ తిరుగుతూ సేవలు అందిస్తున్నారు.
అయితే ఈ విషయాన్ని గుర్తించిన పుడ్ బ్లాగ్ సౌరభ్ పంజ్వాని తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియో చాలా ఎమోషనల్ గా ఉండటంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. అయితే పిల్లల కోసం ఆ జొమాటో బాయ్ చేసే పని తనకు స్ఫూర్తిని ఇచ్చిందంటూ రాసుకొచ్చాడు. ఒక వ్యక్తి కావాలనుకుంటే ఏదైనా చేయగలడనే విషయాన్ని మనం నేర్చుకోవాలంటూ తెలిపాడు.
View this post on Instagram
ఈ వీడియోపై ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సైతం స్పందించింది. తమ ఉద్యోగులకు అందించే చైల్డ్ కేర్ ప్రయోజనాలను అందించేందుకు ఆ డెలివరీ బాయ్ వివరాలను కోరింది. ఆర్డర్ వివరాలను ప్రైవేట్ మెసేజ్ ద్వారా తలపగలరని.. వెంటనే వీలైన సాయం అందిస్తామని చెప్పారు. పిల్లలందరికీ మొదటి హీరో నాన్నే అనే విషయాన్ని నిజం చేశాడీ డెలివరీ బాయ్.