Ennenno Janmala Bandham November 9 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య కు మాళవిక వేద గురించి తప్పుగా చెబుతూ ఉండడంతో ఆ మాటలు ఖుషి వింటూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్లో వేద ఖుషి, యష్ లను బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు ఆదిత్య, ఖుషి ఇద్దరు సంతోషంగా ఆడుతూ ఉండడం చూసి యష్ మాళవికలు ఆనంద పడుతూ ఉంటారు. అప్పుడు చూసా వైఎస్ పిల్లలు ఎంత బాగా కలిసిపోయారో అని మాళవిక అనడంతో వెంటనే యష్ కోపడుతూ కలిసి పెరగాల్సిన పిల్లలు నువ్వు చేసిన పాడు పని వల్ల వాళ్లు శిక్ష అనుభవిస్తున్నారు అని సీరియస్ అవుతాడు.

Ennenno Janmala Bandham November 9 Today Episode
మరొకవైపు చిత్ర ఎదురుచూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసంత్ రావడంతో చిత్ర కోప్పడుతూ ఉంటుంది. ఇప్పుడు సారీ చిత్ర లేట్ అయింది అనడంతో వెంటనే చిత్ర సారీ ఏంటి సారీ ఎప్పుడు వస్తావు అని చెప్పావు ఎప్పుడు వచ్చావు నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి అని కోపంగా అరుస్తుంది సత్య. అప్పుడు వారిద్దరూ కలిసి కాఫీ షాప్ కి వెళ్తారు. అప్పుడు వసంత్ ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో వెంటనే పక్కనే ఉన్న వాళ్ళ లాయర్ ని చూస్తుంది చిత్ర.
అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి సులోచన ఆక్సిడెంట్ కి సంబంధించిన టోటల్ సి సి ఫుటేజ్ ఇందులో ఉంది సార్ అనడంతో చిత్ర షాక్ అవుతుంది. అప్పుడు ఆ లాయర్ యష్ కి ఫోన్ చేస్తాడు. అప్పుడు యష్ గారు మీరు అడిగినట్టుగా సిసి పుటేజ్ వచ్చింది దాన్ని మీకు ఇస్తాను ఇకపై ఈ కేసు ఉండదు కొట్టేస్తారు అనడంతో సంతోష పడుతూ ఉంటాడు. ఆ మాట విన్న చిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఈ విషయాన్ని వెంటనే అక్కకు చెప్పాలి అని అక్కడ నుంచి బయలుదేరుతుంది చిత్ర. మరొకవైపు ఆదిత్య మమ్మీ అక్కడ స్విమ్మింగ్ పూల్ లో చాలా బాగుంది గేమ్స్ బాగున్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది అనడంతో మాళవిక నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఆది అని అంటుంది. మొదటిసారిగా ఖుషి ఆ వేద ను వదిలి వచ్చింది ఈ పిక్నిక్ తర్వాత ఖుషి ని వేదా కి పూర్తిగా దూరం చేస్తాను అని అంటుంది మాళవిక. ఆ మాటలు ఖుషి వింటూ ఉంటుంది.
Ennenno Janmala Bandham నవంబర్ 9 ఎపిసోడ్ : యశ్, అభిమన్యుకు షాకిచ్చిన మాళవిక..
మరొకవైపు చిత్ర వేద దగ్గరికి వెళుతుంది. అప్పుడు ఏమయింది ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నావు చిత్ర అనడంతో చిత్ర జరిగిన మొత్తం వివరిస్తుంది. చిత్ర మాటలు విన్న వేద ఒకసారిగా షాక్ అవుతుంది. అప్పుడు వేద మీ బావ అలాంటి పని చేయడు ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి చిత్ర అని చిత్ర మాటలను కొట్టి పారేస్తుంది వేద. మరొకవైపు ఖుషి,ఆదిత్య ఇద్దరు గేమ్ ఆడుతూ మాతోపాటు మీరు కూడా గేమ్ ఆడాల్సిందే అని యష్ ని బలవంత పెడుతూ ఉంటారు.
అందుకు యష్ సరే అని అంటాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి కళ్ళకు గంతలు కట్టే గేమ్ ఆడుతూ ఉంటారు. మరొకవైపు వేద సులోచన దగ్గరికి వెళ్ళగా ముందు నాతో కాదు మీ చెల్లెలు అలిగింది ఫస్ట్ అక్కడికి వెళ్లి బుజ్జగించు అని అంటుంది. మరొకవైపు యష్ అందరూ కలిసి ఒక హోటల్ కి వెళ్తారు. అక్కడ రూమ్ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్తారు.
అప్పుడు మాళవిక అందరూ కలిసి సెల్ఫీ తీసుకోగా ఆ ఫోటోని ప్రొఫైల్ ఫోటో పెడుతుంది మాళవిక. మరొకవైపు అభిమన్యు నా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు నేనంటే మాళవికకు అంత కేర్ లేస్సా అని కోపడుతూ ఉంటాడు. మాళవిక ప్రొఫైల్ ఫోటో పెట్టి ఈ ఫోటోని చూసి అటు అభి ఇటు వేద ఇద్దరు కుమిలి పోవాలి అని సంతోషపడుతూ ఉంటుంది.