Ennenno Janmala Bandham November 8 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వేద,యష్ కోసం లగేజ్ సిద్ధం చేస్తూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్లో వేద ఖుషికి అల్లరి చేయకూడదు అక్కడ ఆదిత్య అన్నయ్యతో గొడవలు పడకూడదు ఎక్కడికి వెళ్లొద్దు అని జాగ్రత్తలు చెబుతూ ఉండగా అది చూసి ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు వేద ఎమోషనల్ అవుతూనే ఖుషి తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వేద ఇందులో మీకోసం కూడా షట్టర్ మఫ్లర్ అన్ని పెట్టాను జాగ్రత్త అని చెప్పి యష్ కి బ్యాగ్ ఇస్తుంది.

Ennenno Janmala Bandham November 8 Today Episode
అప్పుడు యష్ టైం అవుతుంది అని అక్కడ నుంచి ఖుషిని పిలుచుకొని వెళ్తూ ఉండగా వేద ఎమోషనల్ అవుతూ ఉంటుంది.. ఇంతలో ఖుషి మళ్లీ వెనక్కి వచ్చి వేదని పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరొకవైపు మాళవిక,ఆదిత్య ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఖుషి ఆదిత్యను ప్రేమగా పలకరిస్తుంది. మాళవిక ఖుషిని పలకరించగా ఖుషి మాత్రం పలకరించకుండా లోపలికి వెళ్లి కూర్చోవడంతో మాళవిక బాధపడుతుంది.
మరొకవైపు వేద ఇంటిపై నుంచి ఖుషి వెళ్లడం చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరొకవైపు చిత్ర వసంత్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసంత్ వస్తాడు. వాళ్ళిద్దరూ వేద యష్ ల గురించి మాట్లాడుకుంటూ ఆ తర్వాత ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు వేద ఈపాటికి వాళ్లు అక్కడికి వెళ్లి ఉంటారా ఖుషి ఏం చేస్తుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది.
Ennenno Janmala Bandham నవంబర్ 8 ఎపిసోడ్ : వేద, ఖుషి ఎమోషనల్.. మాళవిక పై యష్ ఫైర్ ..
అప్పుడు మిస్టర్ ఆరగ్యాంట్ ఇంకా ఫోన్ చేయలేదు అని యష్ ని తిట్టుకుంటూ ఉండగా ఇంతలోనే ఫోన్ చేస్తాడు. అప్పుడు ఎక్కడున్నారు ఖుషి ఏం చేస్తోంది అని అడగగా ఇప్పుడే ఇచ్చాము వాళ్ళ ఆదిత్య అన్నయ్యతో ఖుషి ఆడుకుంటుంది పిలుస్తాను మాట్లాడు అని అంటాడు. అప్పుడు మాళవిక వేదని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. వేద ఖుషి తో ఆనందంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది.
ఆ తరువాత వేద చెప్పినట్టుగా ఖుషితో ఒక సెల్ఫీ దిగి వేదకి పంపిస్తాడు. ఆ తర్వాత కార్లో పక్కలో ఖుషి కూర్చోవడంతో వెంటనే మాళవిక ఏ ఖుషి వెనుక సీటు నీది కదా అనడంతో వెంటనే ఖుషి నాన్న కార్లలో సీట్లు అమ్ముతారా అంటూ జోక్ చేస్తుంది. అప్పుడు మాళవిక ఈ వేద ఖుషి కి బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించింది అని వేద ని మనసులో తిట్టుకుంటూ వెనక్కి వెళ్లి కూర్చుంటుంది.
ఆ తర్వాత యష్ వాళ్ళు ఒక చోటికి వెళ్లగా అక్కడ ఖుషి ఆదిత్య ఆడుకుంటూ ఉండటం చూసి మాళవిక, యష్ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు యష్ పసిపిల్లలను నువ్వు చేసిన ఒక పాడుపని వల్ల వాళ్లు నరకం అనుభవిస్తున్నాను అంటూ మాళవిక పై ఫైర్ అవుతాడు. ఆ తర్వాత వేద గురించి మాళవిక ఆదిత్య కు తప్పుగా చెబుతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన ఖుషి ఆ మాటలు అన్ని వింటూ ఉంటుంది.
Read Also : Ennenno Janmala Bandham: యష్ మాటలకు ఫుల్ ఎమోషనల్ అయిన వేద.. ఓదార్చి ధైర్యం చెప్పిన మాలిని..?