Ennenno Janmala Bandham: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో యష్ మాళవికు వార్నింగ్ ఇస్తాడు.
ఈరోజు ఎపిసోడ్ లో వేద ఒక ప్రదేశం కొచ్చి వెతుకుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి అభిమన్యు వస్తాడు. అప్పుడు కారు అడ్డంగా పెట్టావ్ ఏంటి పక్కకు తీ అనే విధానంతో అప్పుడు అభి ఏంటి వేద ఎప్పుడు చూసినా కోపంగా మాట్లాడుతావు ఎంతైనా నిన్ను నీకు బంధువే కదా అని అనడంతో ఛీ నువ్వు నాకు బంధువు ఏంటి అని అంటుంది వేద. అప్పుడు ఫస్ట్ ఇకనుంచి నువ్వు వెళ్ళిపో అని వేద అనడంతో నేను వెళ్లడం కాదు నువ్వు నీ లైఫ్ లోకి ఎంటర్ అయిన మాళవిక ను పక్కకు తప్పించు చూద్దాం అని అంటాడు అభి.
అప్పుడు యష్,మాళవిక గురించి నోటికి వచ్చిన విధంగా వాడడంతో వేద సీరియస్ అవుతుంది. ఇప్పుడు నువ్వు నా మాట నమ్మవు అని తెలుసు అందుకే సాక్షాలతో వచ్చాను అని మాళవిక ప్రొఫైల్ ఫోటో చూపించడంతో వేద ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు వేద ఆ ఫోటోలో అలా దిగిన తప్పేంటి అని అనడంతో అభిషేక్ అవుతాడు. అప్పుడు వెంటనే అభి అసలు విషయం చెప్పేస్తాడు. మీ అమ్మకు యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు మాళవికనే.
అంతేకాదు ఆ మాళవికను తప్పించడం కోసం ఎంతగానో ట్రై చేస్తున్నాడు అనడంతో వేద షాక్ అవుతుంది. ఆ విషయాలన్నీ తెలిసి కూడా యష్ ని దగ్గర అబద్దాలు చెబుతూ మాళవికను కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు అని అంటాడు అభి. అప్పుడు అభిమన్యు మాళవిక అంటే యష్ కు ప్రాణం తనకోసం ఏం చేయడానికైనా యష్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అని అనడంతో ఆ మాటను విన్న వేద కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
మరొకవైపు ఆదిత్య ఎంజాయ్ చేస్తూ ఉండగా అది చూసిన యష్ మురిసిపోతూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య కింద పడిపోతూ ఉండగా యష్ జాగ్రత్తగా పట్టుకొని ఏమైనా అయ్యిందా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. మరొకవైపు అభి ఆ మాళవిక నిన్ను యష్ ని విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది అని చెప్పడంతో వేద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కానీ వేదా మాత్రం అభి మాటలు నమ్మకుండా అభి చెప్పేవి అబద్ధాలు అనుకొని యష్ గురించి గొప్పగా చెబుతూ మాట్లాడుతూ ఉంటుంది.
నా భర్త యశోదర్ నన్ను మోసం చేస్తాడు అంటే నేను నమ్మను నమ్మను అని తెగేసి చెబుతుంది వేద. ఇప్పుడు అభి వేద ఇద్దరు కలిసి యష్ వాళ్ళ దగ్గరికి బయలుదేరుతారు. మరొకవైపు సులోచన వేద వాళ్లతో కలిసి పిక్నిక్ పంపించలేదు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి మాలిని రావడంతో మాలిని మీద సీరియస్ అవుతుంది సులోచన. అప్పుడు మాలిని అసలు విషయం చెప్పడంతో సులోచన షాక్ అవుతుంది. అప్పుడు వేద గురించి సులోచన గొప్పగా పొగుడుతూ మాట్లాడుతూ ఉంటుంది.
మరొకవైపు అభి వేద ఇద్దరూ మాళవిక వాళ్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఒకవైపు యష్ ఆదిత్య ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి తినడానికి వెళ్లాలి అని ఆదిత్య మారం చేస్తూ ఉంటాడు. అప్పుడు యష్ మాళవిక ఆదిత్య రాగానే లగేజ్ మొత్తం ప్యాక్ చెయ్ వెళ్లిపోదాము అని అనడంతో వెంటనే మాళవిక ఆ వేద నీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుందా అని అంటుంది. ఇప్పుడు ఎస్ కోపంతో మనం పిల్లల కోసం వచ్చాము ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత నీ దారి నీది నా దారి నాది అని మాళవికకు సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. ఇంతలోనే అక్కడికి అభివాళ్లు రావడంతో మాళవిక, యష్ షాక్ అవుతారు.