Viral video : సింహం అంటే అందరికీ వణుకే. అడవిలోని సింహాన్ని చూస్తే గుండెలు జారిపోవడం ఖాయం. పొడవాటి జూలు, మొన దేలిన పళ్లు, గంభీరమైన చూపులు, భారీ పంజా, అలా సింహం జూలు విదుల్చుకుంటూ నడిచి వస్తుంటే భయంతో వణికిపోతాం. దాని గాంభీర్యం ఎంతో భయపెడుతుంది. అందుకే అవి అడవికి రాజులయ్యాయి. మృగరాజులుగా పిలువబడుతున్నాయి. సింహం గర్జిస్తే దాని శబ్ధం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుందట.

అలాంటి సింహానికే సుస్సు పోయించింది ఓ అడవి దున్న. తన కొమ్ములతో ఎత్తి పడేసింది. ఒకసారి కాదు రెండు సార్లు తన కొమ్ములతో ఎత్తి సింహాన్ని నేలకేసి పడేసింది. దున్న దాడితో జడుసుకున్న సింహం.. బతుకు జీవుడో అంటూ అక్కడి నుండి పారిపోయింది. సింహానికే చుక్కలు చూపించిన ఆ అడవి దున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Viral Video : సింహాన్ని కొమ్ములతో ఎత్తి పడేసిన అడవి దున్న.. వీడియో వైరల్!
సింహం ఓ అడవి దున్నపై దాడి చేసింది. ఆ సింహం దాడిలో ఆ అడవి దున్న కుప్పకూలిపోయింది. తనలో ఓపిక లేకపోయే సరికి అలా కూర్చుండి పోయింది. దాని వెనక చేరిన సింహం దాని చర్మాన్ని ఒలవడం ప్రారంభించింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన మరో దున్న.. ఆ సింహాన్ని చూసి కోపంతో వేగంగా వచ్చింది. దాని రెండు కొమ్ములతో సింహాన్ని ఎత్తి పడేసింది. రెండో సారి కూడా అలాగే ఎత్తి పడేసింది. దున్న దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ సింహం.. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని అక్కడి నుండి పారిపోయింది.
Read Also : Viral Video : నిద్రపోతున్న భార్యను లేపి మరీ రైలు కిందకు తోశాడు.. ఏమైందంటే? షాకింగ్ వీడియో వైరల్!