Viral Video : అంతేగా.. అంతేగా.. ఎఫ్3 (F3) మూవీలో విక్టరీ వెంకటేశ్ డైలాగ్.. పెళ్లికి ముందు ఏమైనా చేయొచ్చు.. అదే పెళ్లి తర్వాతే ఏం చేయాలేం.. అంతేగా.. అంతేగా అనడం తప్పా.. ఈ వీడియో చూస్తుంటే అందరికి అదే సీన్ గుర్తుస్తుంది కదా.. వాస్తవానికి ఇక్కడ ఎఫ్3 మాదిరిగా ఏం జరగలేదండోయ్.. ప్రేమించిన అమ్మాయిని పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. కానీ, కన్నీళ్లు ఆపుకోలేక పెళ్లిపీటలపై ఎక్కెక్కి ఏడ్చేశాడు.. అదేంటీ.. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆనందంతో చిందులు వేయాలి గానీ ఇలా ఏడ్చేయడమేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే.. ఆనంద పట్టలేక ఇలా పెళ్లికొడుకు ఆనంద బాష్పాలు కార్చాడట.. దాదాపు ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఎవరినో ఒకరి ఏదో ఒక సమయంలో ప్రేమించే ఉంటారు. అయితే అందరి ప్రేమలు పెళ్లిదాకా రావు.
కొంతమంది మాత్రమే తమ ప్రేమను గెలుస్తారు.. పెద్దలన్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. అలాంటి ప్రేమ జంటల్లో ఈ జంట కూడా ఒకటి.. అంతా బాగానే ఉందిగా.. ఇంకా ఏడ్వడం ఏంటి అంటే.. తాను ప్రేమించిన అమ్మాయిని ఇలా పెళ్లి పీటలపై చూసేసరికి ఆమెను పొందడానికి అతడు పడిన కష్టం గుర్తు వచ్చినట్టుంది.. అందుకే ఆమె వంక చూడగానే కళ్లలోనుంచి కన్నీళ్లు తన్నుకొచ్చాయట.. దాంతో అక్కడివారంతా పెళ్లి కొడుకుని చూసి ఫుల్ ఎమోషన్ అయిపోయారు. అప్పుడే పెళ్లి కూతరు అతడి వంక చూస్తూ ఇలా లుక్ ఇచ్చింది అంతే.. ముసి ముసి నవ్వుతూ చూపుల బాణాలను విసిరింది… అంతే.. అప్పటివరకూ కంటతడి పెట్టిన పెళ్లికొడుకు నవ్వడం మొదలుపెట్టేశాడు.. ఈ పెళ్లి తంతు జరిగేటప్పుడు అక్కడివారు తమ కెమెరాల్లో వీడియోను రికార్డు చేశారు. ఆ తర్వాత ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
పెళ్లి పీటలపై ఆనందంతో ఉన్న పెళ్లి కొడుకు ఎందుకు ఏడుస్తున్నాడో అప్పటివరకూ అక్కడి వారికి పాలుపోలేదు. అరే.. ఇదేంటీ ఈ అబ్బాయి ఇలా ఏడుస్తున్నాడు అనుకున్నారు.. అతడి బంధువులు కూడా పెళ్లికొడుకుతో పాటు ఏడ్చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా అమ్మాయి మెడలో తాళి కట్టే సమయంలో పెళ్లి కొడుకు బోరుమని ఏడ్చేయడం అందరిని కంటతడి పెట్టించింది. పెళ్లికూతరు ఒక చిరునవ్వును చిందించగానే అతడికి వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది.. వెంటనే సంతోషంతో తాళి అందుకుని ఆ అమ్మాయి మెడలో కడుతూ ముద్దు పెట్టేశాడు. అంతే.. అక్కడివారంతా అవాక్ అయ్యారు. ఇదంతా వీడియో రికార్డు చేసిన వారూ ఇన్ స్టాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా ట్రూ లవ్ స్టోరీ అంటే ఇదేగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోను చూస్తే.. మీరూ ఇదే అంటారు..
AdvertisementView this post on Instagram
Advertisement
Read Also : F3 Movie: F3 మూవీలో స్పెషల్ ఐటెం సాంగ్ చేసేది ఎవరో గుర్తుపట్టారా? రెమ్యునురేషన్ తెలిస్తే షాకే..!