September 22, 2024

F3 Movie: F3 మూవీలో స్పెషల్ ఐటెం సాంగ్ చేసేది ఎవరో గుర్తుపట్టారా? రెమ్యునురేషన్ తెలిస్తే షాకే..!

1 min read
pjimage 2022 04 15T161841.835

F3 Movie: అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసింది ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా ఎఫ్ 3 వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా ప్రత్యేక పాట ఉండటం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఈ ప్రత్యేక పాటలో నటించడం కోసం ప్రత్యేకంగా కొందరు హీరోయిన్లు ఉండేవారు. కానీ ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ లో కూడా టాప్ హీరోయిన్ లు నటించడం గమనార్హం. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఇలా ఐటమ్స్ ద్వారా నటించి మంచి గుర్తింపు పొందారు.

pjimage 2022 04 15T161841.835ఇకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న F 3 సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా మరొక స్టార్ హీరోయిన్ చిందులు వేయనుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ఆమె ఫోటోని అధికారికంగా వెల్లడించారు. బ్యాక్ లుక్ లో ఉన్నటువంటి ఈ ఫోటోని చూసి వెంటనే ప్రతి ఒక్కరూ పూజాహెగ్డే అంటూ ఇట్టే గుర్తు పడుతున్నారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో నటించనుంది.ఇక ఈ విషయాన్ని చిత్ర బృందం నేడు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే పూజా హెగ్డే ఇప్పటికే రంగస్థలం సినిమాలో జిగేలురాణి అంటూ ఐటెం సాంగ్ ద్వారా ప్రతి ఒక్కరిని సందడి చేశారు.

తాజాగా మరోసారి ఈ బుట్ట బొమ్మ ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్లో నటించడం కోసం పూజా హెగ్డే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఒక రోజుకు సుమారు 50 లక్షల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.పూజా హెగ్డే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఈ పాటను రెండు మూడు రోజులలో పూర్తి చేయాలని చిత్రబృందం భావించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మరోసారి బుట్ట బొమ్మ ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.