Shocking Video : చచ్చిపోదామని యువతి పట్టాలపై దూకింది.. పైనుంచి రైలు వెళ్లిపోయాక లేచి ఏం చేసిందో చూడండి.. షాకింగ్ వీడియో..!

Shocking Video : Young Lady lies on railway tracks as train runs over on her, Video Goes Viral
Shocking Video : Young Lady lies on railway tracks as train runs over on her, Video Goes Viral

Shocking Video : చావునే మోసగించింది.. చచ్చిపోదామనుకుంది.. రైలు వచ్చేది చూసి అదే సమయంలో రైలు పట్టాలపై దూకింది. అంతే.. వేగంగా దూసుకొస్తున్న రైలు ఆమెపై నుంచి వెళ్లింది. కట్ చేస్తే.. పట్టాలపై పడుకుని ఉన్న ఆ యువతి రైలు వెళ్లిపోయాక.. కూర్చొని లేచి ఫోన్ మాట్లాడుతూ వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆ యువతికి చిన్న గాయం కూడా కాలేదు. చూడటానికి భయానక దృశ్యమైనప్పటికీ ఆమె తీరు అందరికి నవ్వును తెప్పించేలా ఉంది.

యువతి ఎరుపు రంగు చుడీదార్ ధరించి ఉంది. బ్లూ కలర్ స్కార్ఫ్ తో రైలు పట్టాలపైకి వెళ్లి నిలబడింది. అప్పుడే వేగంగా దూసుకొస్తున్న గూడ్స్ రైలు అమాంతం ఆమెపై నుంచి వెళ్లిపోయింది. అక్కడి ప్లాట్ ఫాంపై చూసినవాళ్లంతా ఆమె చనిపోయి ఉంటుందని అనుకున్నారు. కానీ, అదృష్టవశాత్తూ ఆ యువతి ప్రాణాలతో బయటపడింది.

Advertisement
Shocking Video : Young Lady lies on railway tracks as train runs over on her, Video Goes Viral
Shocking Video : Young Lady lies on railway tracks as train runs over on her, Video Goes Viral

అతిపెద్ద గూడ్స్ రైలు ఆమెపై నుంచి వెళ్తున్నా కొంచెం కూడా భయపడకుండా అలానే ఉండిపోయింది. రైలు వెళ్లిపోయాక.. హాయిగా ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి జారుకుంది. ఈ ఘటనకు సంబంధించి వీడియోను ఎవరో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Read Also : 22 yeas house arrest: ఒకటి కాదు రెండు కాదు 22 ఏళ్లు.. గదిలో బందీ అయిన మహిళ!

Advertisement