Guppedantha Manasu Serial Sept 30 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో బాగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిస్తుడ్ లో గౌతమ్, జగతి దంపతులు రిషి వసు లను ఎలా అయినా దగ్గర చేయాలి అని అనుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో జగతి దంపతులు, గౌతమ్ కలిసి రిషి, వసు లను కలపడం కోసం కాలేజీలో మిగిలిపోయిన మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను ప్రారంభించాలి అని అనుకుంటారు. ఇక వీరందరూ కలిసి మాట్లాడుకుంటుండగా దేవయాని ఏదో జరుగుతోంది అని వారి మాటలు వింటూ ఉంటుంది. మరొకవైపు రిషి వాసు గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే మహేంద్ర రిషి కోసం కాఫీ తీసుకొని వస్తాడు.
ఆ తర్వాత కొద్దిసేపు రిషితో ప్రేమగా మాట్లాడతాడు. అప్పుడు కాలేజ్ మిషన్ ఎడ్యుకేషన్ మీటింగ్స్ ఉన్నాయి అని జగతి చెప్పింది నీకు చెయ్యి నొప్పి ఉంటే ఇక్కడే ఉండు మేము వెళ్లి చూసుకుంటాము అని అంటాడు మహేంద్ర. అప్పుడు వెంటనే పర్లేదు డాడ్ నేను కూడా వస్తాను అని అంటాడు. ఆ తర్వాత రిషి కాలేజీ కి వెళ్ళగా అక్కడ ఒక హార్ట్ సింబల్ ఉండడం చూసి వసుధర ను తన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటాడు రిషి.
ఇంతలోనే జగతి, రిషి తో మాట్లాడడానికి రావడంతో మీటింగ్లో కలుద్దాం మేడం అని అంటాడు. ఆ తర్వాత అందరూ మీటింగ్ కి కూర్చుని ఉండగా ఇంతలో విద్యాశాఖ మంత్రి నుంచి ఎవరు కోఆర్డినేటర్ వచ్చి మనకు దాని గురించి వివరిస్తారు అని చెప్పడంతో అప్పుడు రిషి అవును ముందు వాళ్ళు చెప్పేది విందాం అని అంటాడు.
ఇంతలో కోఆర్డినేటర్ గా వసుధార ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇప్పుడు రిషి ఈ విషయం నాకు వసుధార ఎందుకు చెప్పలేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధర మిషన్ ఎడ్యుకేషన్ కోసం ఈ ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అని చెప్పడంతో అందరి సంతోష పడతారు.
Guppedantha Manasu Serial సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : ఎన్నాళ్లు దాస్తారో దాచండి.. ఏదో ఒక రోజు బయటపెడతా..
ఆ తర్వాత మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి కోఆర్డినేటర్ గా వసుధార తన ఒపీనియన్ చెబుతుంది. అప్పుడు వసు రిషి సంతకం కావాలి అని అనడంతో వెంటనే రిషి జగతికి ఇవన్నీ మీరే చూసుకోండి మేడం అని చెబుతాడు. ఆ తర్వాత రిషి చేతికి లాప్టాప్ తగలడంతో అందరూ టెన్షన్ పడతారు. అందరూ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత వసు మళ్లీ వెనక్కి వచ్చి చూసుకోవాలి కదా అని జాగ్రత్తలు చెబుతుంది.
మరొకవైపు గౌతమ్ గేమ్స్ ఆడుకుంటూ ఉండగా ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి వారు ఏం మాట్లాడారో తెలుసుకోవాలి అని గౌతమ్ ని ఇన్ డైరెక్ట్ గా అడుగుతూ ఉండగా గౌతం కూడా చెప్పకుండా వేరే సమాధానం చెబుతూ ఉంటాడు. అప్పుడు దేవయాని ఇంకెన్నాళ్లు దాస్తారో దాచండి ఏదో ఒక రోజు బయట పెడతాను అని అనుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత మహేంద్ర వర్మ మినిస్టర్ కి ఫోన్ చేసి వసుధారకు జాబ్ ఇచ్చినందుకు థాంక్స్ అని చెబుతాడు. ఆ తర్వాత రిషి మినిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వసుధార కూడా ఉంటుంది. అప్పుడు వసు ని చూసిన రిషి కారు లేదా అంటూ వెటకారంగా మాట్లాడతాడు. అప్పుడు ఈ జాబ్ కి అప్లై చేసినట్టు నాకు ఎందుకు చెప్పలేదు అని అడగడంతో ఇంట్లోకి ఖాళీగా ఎందుకు ఉండటం అని అప్లై చేశాను సార్ అని అంటుంది వసు.
Read Also : Guppedantha Manasu serial Sep 28 Today Episode : వసుధార మీద కోపంతో రగిలిపోతున్న రిషి..బాధలో జగతి దంపతులు..?