Telugu NewsLatestIntinti Gruhalakshmi serial Oct 6 Today Episode : జాబు పోయినందుకు బాధపడుతున్న తులసి.....

Intinti Gruhalakshmi serial Oct 6 Today Episode : జాబు పోయినందుకు బాధపడుతున్న తులసి.. ఆనందంలో అనసూయ, అభి..?

Intinti Gruhalakshmi serial Oct 6 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సామ్రాట్, తులసిని జాబ్ లో నుంచి తీసేసినందుకు తులసి బాధపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లతులసి సామ్రాట్ తో భాస్ గా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. తప్పు చేసినప్పుడే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. నందగోపాల్ గారికి మేనేజర్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయి కంగ్రాట్స్ నందగోపాల్ గారు అని నందుకి చెబుతుంది తులసి. అప్పుడు లాస్య ఈమాట నిజంగానే మాట్లాడుతున్నావా తులసి అని అనగా నేను మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడను లాస్య ఆ విషయం ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు అని అంటుంది తులసి.

Advertisement
Tulasi convinces her family about Samrat's decision in todays intinti gruhalakshmi serial episode
Tulasi convinces her family about Samrat’s decision in todays intinti gruhalakshmi serial episode

అప్పుడు లాస్య తులసి తప్పు చేసిన తనకి ఏదో ఒక ఉద్యోగం ఇవ్వండి సామ్రాట్ గారు అని అనగా వద్దు లాస్య ఈ పంజరంలో నేను ఉండలేను అని పార్టీ నుంచి తన కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళిపోతుంది తులసి. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ బాధపడుతూ ఉండగా అనసూయ అభీలు మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు ప్రేమ్ అమ్మా నీకు ఇబ్బందిగా అనిపించలేదా అని అనడంతో లేదు ప్రేమ్ ఉద్యోగం ఇబ్బందిగానే చేశాను ఇప్పుడు నావల్ల తప్పు జరిగినప్పుడు నేను అక్కడ ఉండటం నాకు నచ్చదు కదా అందుకే ఆ మాట చెప్పి వేశాను అని అంటుంది తులసి.

Advertisement

మరొకవైపు హనీకి సామ్రాట్ భోజనం తినిపిస్తూ ఉండగా సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అక్కడికి వస్తాడు.. అప్పుడు సామ్రాట్ హనీ ని లోపలికి వెళ్ళమని చెబుతాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తులసి విషయంలో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు కావాలనే చేస్తున్నావ్ కదా అని నిలదీయడంతో వెంటనే సామ్రాట్ జరిగిందంతా వివరిస్తాడు.

Advertisement

ఇంటింటి గృహలక్ష్మి అక్టోబర్ 6 ఈరోజు ఎపిసోడ్ : బాబాయ్ నిలదీయడంతో నిజం చెప్పేసిన సామ్రాట్..

వాళ్ల కుటుంబ సభ్యులకు తులసి మాట పడటం వాళ్లకి ఇష్టం లేదు అందుకే నేను అలా ప్రవర్తించాల్సి వచ్చింది బాబాయ్ అని చెబుతాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఆవిడ ఏదో ఆవేశంలో అన్నదని నువ్వు కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటావా అని అనగా లేదు బాబాయ్ బయటికి వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటున్నారు అని అంటాడు సామ్రాట్.

Advertisement

వాళ్ల వల్ల తులసి గారు బాధపడటం నాకు ఇష్టం లేదు. హనీ నీ తులసి గారిని విడదీయడం చాలా కష్టం తులసి గారు లేకుండా హనీ ఉండలేదు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను బాబాయ్ అని అంటాడు. నాకు తులసి గారు స్నేహితురాలు కాదు భాగస్వామి కాదు అంతకంటే ఇంకేదో అనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సామ్రాట్.

Advertisement

మరొకవైపు తులసి ఇంట్లో అందరూ జరిగిన విషయం గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు అభి ఆ దాన్ని అవకాశంగా తీసుకొని అర్హత లేని మేనేజర్ పోస్ట్ ఇచ్చినప్పుడే నేను ఇలా జరుగుతుందని ముందే ఊహించాను అని అంటాడు. వృద్ధులసి అంతా మన మంచికే జరిగింది నేను ఏ నిబంధన లేకుండా స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు అని అనడంతో వెంటనే పరంధామయ్య నాకు తెలిసి సామ్రాట్ ఈ నిర్ణయం తీసుకోలేదు ఎవరో బలవంతంగా చేయించినట్టు ఉన్నారు అనడంతో అనసూయ టెన్షన్ పడుతూ ఉంటుంది.

Advertisement

అప్పుడు శృతి సామ్రాట్ గారిని ఎదిరించి ధైర్యం ఎవరికి ఉంటుంది తాతయ్య ఆయన ఏమన్నా చిన్నపిల్లలు కాదు కదా అని అనడంతో అప్పుడు తులసి ఆ విషయాన్ని ఇంకా ఇక్కడితో వదిలేయండి రేపటి నుంచి యధావిధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అని అంటుంది. తులసి ఆ మాట అందడంతో అనసూయ ఊపిరి పీల్చుకుంటుంది.

Advertisement

మరుసటి రోజు సామ్రాట్ ఆఫీస్ కి రెడీ అవుతూ కిందకు వచ్చి వాళ్ళ బాబాయ్ తో తులససి ని రెడ్డి అవమని చెప్పండి బాబాయ్ అని అనటంతో వెంటనే వాళ్ళ బాబాయ్ మనసు మార్చుకున్నావా తులసిని మళ్ళీ ఉద్యోగంలో తీసుకుంటావా అని అడగగా సారీ బాబాయ్ మర్చిపోయాను అని అంటాడు. అప్పుడు సామ్రాట్ లాస్య వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా ప్రాజెక్టుల తో నేను బిజీగా ఉంటాను మీరు ఆ మ్యూజిక్స్ స్కూల్ ప్రాజెక్ట్ గురించి చూసుకోండి అని చెబుతాడు.

Advertisement

ఇప్పుడు తులసిని జాబు తీసేసినప్పుడు మరి తులసి ప్రాజెక్టు ఎందుకు సార్ అని అనడంతో నేను ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే దాని పూర్తి అయ్యేవరకు విడిచిపెట్టెను అంటాడు సామ్రాట్. అప్పుడు సామ్రాట్ మ్యూజిక్ స్కూలు గురించి మీరు నందు కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు సామ్రాట్. ఆ మాటలు అన్నీ కూడా లాస్య నందుతో చెప్పి ఆలోచనలో పడుతుంది. మరొకవైపు సామ్రాట్ చేసిన తప్పు గురించి వాళ్ళ బాబాయ్ తప్పు అని చెబుతూ ఉంటాడు..

Advertisement

Read Also : Intinti Gruhalakshmi serial Oct 5 Today Episode : తులసిని దూరం పెడుతున్న సామ్రాట్.. ఆలోచనలో పడ్డ తులసి..?

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు