Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Intinti Gruhalakshmi serial Oct 5 Today Episode : తులసిని దూరం పెడుతున్న సామ్రాట్.. ఆలోచనలో పడ్డ తులసి..?

Intinti Gruhalakshmi serial Oct 5 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇ

By Ramesh Babu

Published on: October 5, 2022 11:45 AM

Updated on: October 5, 2022 2:31 PM

nandu-and-lasya-feel-elated-with-samrats-unexpected-decision-in-todays-intinti-gruhalakshmi-serial-episode

---Advertisement---

Intinti Gruhalakshmi serial Oct 5 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో అనసూయ సామ్రాట్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో నేను చెప్పిన మాటను ఎందుకు మీరు సీరియస్ గా తీసుకోవడం లేదు నాకు అర్థం కావడం లేదు మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే జీవితాంతం సమయం తీసుకుంటారు కాబట్టి పార్టీ అయ్యేలోపు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి లేకపోతే నేనే రంగంలోకి దిగుతాను. అని సామ్రాట్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనసూయ.

nandu-and-lasya-feel-elated-with-samrats-unexpected-decision-in-todays-intinti-gruhalakshmi-serial-episode
nandu-and-lasya-feel-elated-with-samrats-unexpected-decision-in-todays-intinti-gruhalakshmi-serial-episode

ఇంతలోనే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి ఎందుకు ఆవిడ అంత కోపంగా మాట్లాడుతోంది అని అడగగా ఏమీ లేదు అని అంటారు సామ్రాట్. మరొకవైపు నందు, లాస్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ఒక అతను వచ్చి నందు జీవితం గురించి నందు లాస్యల గురించి నోటికొచ్చిన విధంగా వాడడంతో నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

Advertisement

అప్పుడు లాస్య నందు నీ పక్కకు పిలుచుకొని వెళ్తుంది. ఎందుకు లాస్య పక్కన పిలుచుకొని వచ్చావు వాడు చూసావా ఎలా వాగుతున్నాడో అని అనడంతో ఇప్పుడు మనం కూల్ గా ఉండాలి నందు గొడవలు పెట్టుకోకూడదు అని అనడంతో వెంటనే అవి అక్కడికి వచ్చి ఆంటీ చెప్పింది కరెక్టే డాడ్ అని అంటాడు. నానమ్మ కూడా అమ్మ విషయంలో చాలా సీరియస్ గా ఉంది అని అనటంతో సామ్రాట్ అభిమానులను నమ్మడు.

ఆ తర్వాత అభి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు హనీనీ తులసి రెడీ చేయడంతో సామ్రాట్ అక్కడికి వచ్చి హని ని చూసి మురిసిపోతూ ఉంటాడు. అప్పుడు హాని పిల్లలు రావడంతో వారితో కలసి అక్కడ నుంచి వెళ్లిపోగా వెంటనే తులసి సామ్రాట్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తులసి ఎందుకు మీరు అలా ప్రవర్తిస్తున్నారు అని అనడంతో సామ్రాట్ తులసికి అబద్ధం చెబుతూ ఉంటాడు.

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ అక్టోబర్ 5 ఈరోజు ఎపిసోడ్ : తులసి షాక్..లాస్య,నందు ఆనందం..

రోజురోజుకీ హనీ మీకు దగ్గర అవుతుంది ఆ స్వార్థంతోనే ఇలా చేస్తున్నాను తులసి గారు అని అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు సామ్రాట్. ఆ తర్వాత పార్టీ మొదలవడంతో అందరూ పార్టీకి వస్తారు. అప్పుడు నందు లాస్య, సామ్రాట్, తులసి లను చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. అనసూయ కూడా వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

ఆ తర్వాత హనీ కేక్ కట్ చెయ్ అని సామ్రాట్ చెప్పడంతో లేదు నాన్న నేను మా తులసి టీచర్ కోసం ఒక పాటను పడతాను అని చెప్పి తులసి కోసం ఒక పాటను పాడుతూ తులసి తో కలిసి డాన్స్ చేస్తుంది అని అది చూసి అందరూ చెప్పట్లతో ఆనందిస్తూ ఉండగా అనసూయ,నందు దంపతులు మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు.

Advertisement

ఆ తర్వాత సామ్రాట్ నందుని పొగుడుతూ నందుని తులసి గారి స్థానంలో ఈ కంపెనీ మేనేజర్ గా నియమిస్తున్నాను అనడంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కానీ నందు లాస్య దంపతులు మాత్రం ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. అందువల్ల సామ్రాట్ వాళ్ళ బాబాయ్ మాత్రం ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తులసి నవ్వుతూ కంగ్రాట్యులేషన్స్ నందగోపాల్ గారు అని చెబుతుంది. ఆ తరువాత ఎవరైతే లేకుండా తన కంపెనీ మంచి కోసం చూస్తారో తనే నిజమైన బాస్. సామ్రాట్ గారు మీరే అసలైన బాస్ మంచి పని చేశారు అని అంటుంది తులసి.

Read also : Intinti Gruhalakshmi serial Oct 4 Today Episode : తులసిని మేనేజర్ జాబ్ నుంచి తీసేసిన సామ్రాట్.. బర్త్ డే పార్టీ నుంచి వెళ్లిపోయిన తులసి..?

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.