Revanth reddy : తెలంగాణలో అధికారం కోసం బీజేపీ అడ్డదారులు తొక్కుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండి పడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యుడని, వెంకట్ రెడ్డి వేరు, రాజ గోపాల్ రెడ్డి వేరంటూ వ్యాఖ్యానించారు. తాను రాజగోపాల్ రెడ్డి ఉద్దేశించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. తనకు వెంటక్ రెడ్డి మధ్య అంతరాలు పెంచేలా కొందరు ప్రయత్నించినందునే ఆయన అపార్థం చేస్కున్నట్లు వివరించారు. రాజగోపాల్ రెడ్డిని సొంత పార్టీని ముంచేందుకు యత్నించిన ద్రోహిగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పటికీ తమ నాయకుడేనని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి చేసిన పోరాటాలు కాంట్రాక్టుల గురించి తేల్చేందుకే చండూరుకు వస్తున్నామన్న రేవంత్.. నిజాయితీ పరుడైతే తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాను పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేసే వారిగి లీగల్ నోటీసులు ఇస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. కోమటిరెడ్డి బ్రాండ్ లేదనడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also : RGV Tweet on revanth reddy: రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ అంటూ ఆర్జీవీ ట్వీట్..!