RGV Tweet on revanth reddy: రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ అంటూ ఆర్జీవీ ట్వీట్..!

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ.. తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పొగుడుతూ.. ట్విట్టర్ ద్వారా ట్వీట్ పెట్టారు. రేవంత్ రెడ్డిని రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ అని అభివర్ణిస్తూ… ఆకాశానికెత్తేశారు. వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. అయితే ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీరిద్దరు భావాలు, నేపథ్యాలు వేరు అయినప్పటికీ.. ఆర్జీవీ రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించడం వెనుక కారణం ఏంటోనని చాలా మంది అనుకుంటున్నారు.

వీరి కలయిక ఎందుకనేది తెలియక నానా చర్చలు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డిపై రాం గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించడం వల్ల ఆయన అభిమానులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. చాలా బాగున్నారు.. మీరు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ చాలా మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel