Horoscope : ఈరోజు అనగా జులై 21వ తేదీన ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల 12 రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరించారు. ముఖ్యంగా ఈరోజు రెండు రాశుల వారికి శారీరక శ్రమ పెరిగే అవకాశం కనిపిస్తోందని చెప్పారు. వారు చాలా జాగ్రత్తగా ఉండాలని.. లేకపోతే శ్రమ ఎక్కువై పలు రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని వివరించారు.

మేష రాశి.. మేష రాశి వాళ్లు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీస్కోవడం వల్ల తర్వాత ఇబ్బందుల పాలవుతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే మంచి ఫలితాలు కల్గుతాయి.
సింహ రాశి.. సింహ రాశి వాళ్లు చేపట్టే ప్రతీ పనిలో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగాలి. కొందరి ప్రవర్తన బాధ కల్గిస్తుంది. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.
Read Also : Gold prices today : స్వల్పంగా పెరిగి బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?