...

Bullet bhasker: అప్పారావు జబర్దస్త్ ను వీడేందుకు బుల్లెట్ భాస్కరే కారణమా..?

Bullet bhasker: జబర్దస్త్ కార్యక్రమం గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అందులో స్కిట్ లు చేసే కంటెస్టెంట్ల నుంచి జడ్జీల వరకు అందరూ తెగ ఫేమస్ అయిపోయారు. కేవలం కమెడియన్లనే కాకుండా వారి ఫ్యామిలీలతో కూడా స్కిట్లు చేయించారు. అంతేనా వారిని తీసుకొచ్చి కంటెస్టెంట్లకి సర్ ప్రైజ్ ఇవ్వడం, వారి కష్ట, నష్టాలు, సంతోషాల గురించి షోలో చెప్పించడంతో అన్ని రకాల ఎమోషన్లు క్యారీ అవుతున్నాయి. అందుకే ప్రతీ ఒక్కరూ ఈ ప్రోగ్రాంకు కనెక్ట్ అవుతున్నారు. అయితే ఈ మధ్య జబర్దస్త్ కార్యక్రమంలో పాత వాళ్లు చాలా తక్కువగా కనిపిస్తున్నారు.

అయితే తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో ఎప్పటిలాగే కమెడియన్లు వారి అద్బుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో జడ్జిగా ఇంద్రజ… టీం లీడర్ ను కొన్ని ప్రశ్నలు అడుగుతూ కనిపించారు. బుల్లెట్ బుల్లెట్ భాస్కర్ వల్లే… అప్పారావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారని వాదన వినిపిస్తోంది ఇందులో నిజముందా అని అడిగింది. ఈ ప్రశ్నకు బుల్లెట్ భాస్కర్ సమాధానం చెప్తూ… ఇప్పటి వరకు నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకోలేదు కానీ ప్రస్తుతం సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నానంటాడు. కరెక్టుగా అదే టైంకి ప్రోమో పూర్తవుతుంది. అయితే ఈ వీడియో కోసం చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు.