Husband murder: ఈ మధ్య తరచుగా భార్యను చంపిన భర్త, భర్తను చంపిన భార్య.. ప్రియుడి, ప్రియురాలి కోసం పెళ్లి చేసుకున్న వాళ్లను చంపడం పరిపాటిగా మారింది. ఏ పేపర్ తిరగేసినా, ఏ ఛానెల్ చూసినా ఇలాంటి వార్తలే దర్శనం ఇస్తున్నాయి. అయితే తాజాగా బీహార్ లోని సరన్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ నవ వధవు తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. అనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయింది.విషయం గుర్తించిన కుటుంబ సభ్యుులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం… సంతోష్ దాస్ అనే 29 ఏళ్ల యువకుడికి గోపాల్ గంజ్ జిల్లాకు చెందిన సిమ్రాన్ కుమార్ కు ఏ్రిల్ 23న వివాహం జరిగింది. తావే ఆలయంలో వీరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. అయితే పెళ్లైన రెండు నెలల పాటు వీరిద్దరూ బాగానే ఉన్నారు. అయితే సిమ్రాన్ ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతుండటంతో భర్తకు అనుమానం వచ్చి… ఆమెను నిలదీశాడు. స్మార్ట్ ఫోన్ లాక్కొని నార్మల్ ఫోన్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవులు కూడా జరిగాయి. అయితే ఇంట్లో ఎవరూ లేని రోజు ప్రియుడిని ఇంట్లోకి పిలుపించుకొని భర్తకు బంధువంటూ ఓ అబ్బాయిని పరిచయం చేసింది.
సిమ్రాన్ తరచూ ఫోన్ లో మాట్లాడడం, బంధువంటూ ఓ అబ్బాయిని ఇంటికి పిలవడంతో సంతోష్ కు అనుమానం ఎక్కువైంది. ఈ విషయంపై ఆమెను నిలదీద్దామనుకునేలోపే వారద్దరూ వచ్చి సంతోషన్ చంపేశారు. అనంతరం ఫ్యాన్ కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులు తీస్కొని, ఇంటికి తాళం వేసి పారిపోయింది. మరుసటి రోజు కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంది. సంతోష్ కి ఫోన్ చేస్తే ఎంతకీ లిఫ్ట్ చేయకపోయేసరికి అనుమానం వచ్చి తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లారు.
సంతోష్ మృతదేహాన్ని చూసి బావురుమన్నారు. కొడలు ఇంట్లో లేకపోయేసరికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లైన రెండు నెలలకే ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.