HomeLatestKarthika Deepam: సౌర్యను దగ్గరుండి తన పెళ్లి చేయమని వేడుకున్న నిరుపమ్.. సౌర్యకు సంబంధం తెచ్చిన...

Karthika Deepam: సౌర్యను దగ్గరుండి తన పెళ్లి చేయమని వేడుకున్న నిరుపమ్.. సౌర్యకు సంబంధం తెచ్చిన సౌందర్య?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్ నేడు మరింత ఉత్కంఠ భరితంగా కొనసాగనుంది. కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇక సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందనే విషయానికి వస్తే…నేటి ఎపిసోడ్ లో భాగంగా స్వప్న శోభను తీసుకొని పెళ్లి కార్డు తో సహా సౌందర్య ఇంటికి వెళుతుంది.

Advertisement

శోభ నిరుపమ్ పెళ్లి కార్డు ఇవ్వడంతో సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అది చూసిన సౌందర్య ఏంటే కథ మళ్ళీ మొదలుకొచ్చింది అని ప్రశ్నించగా కథ ఇప్పుడే మొదలైంది మమ్మీ అంటూ సమాధానం ఇస్తుంది.పెళ్లికూతురు మా ఇంట్లో ఉండగా ఇక్కడ కలేముంటుంది చెప్పు అంటూ శోభ వెటకారంగా మాట్లాడటంతో సౌందర్య విపరీతమైన కోపం తెచ్చుకొని ఆ పెళ్లి పత్రికను ముక్కలు చేస్తుంది.

Advertisement

Advertisement

నా మనవడు మనవరాలకు నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది ఇదే తథ్యం అంటూ చెబుతుండగా అక్కడికి శౌర్య వస్తుంది.అది విన్న సౌర్య బాధతో వెను తిరుగుతుండగా సౌందర్య చూసి సౌర్యను కిందికి తీసుకొచ్చి నువ్వే నీ చేతుల మీదుగా మీ బావ హిమ పెళ్లి చేస్తానని చెప్పావు కదా..అదే మాట నీ పొగరుబోతు అత్తకు కూడా చెప్పు నువ్వే దగ్గరుండి పెళ్లి చేస్తానని చెప్పు అంటూ సౌర్యను అడుగుతుంది.

Advertisement

సూర్య మాత్రం మౌనంగా ఉండిపోతుంది.ఇక స్వప్న అక్కడి నుంచి తన కొడుకుని లాక్కొని ఇంటికి వెళ్ళిపోతుంది.మరుసటి రోజు ఉదయం సౌందర్య ఆనందరావు కార్తీక్ దీప ఫోటోల వద్దకు వచ్చి మీరు వెళ్లిపోవడంతోని ఈ ఇంటిలో నుంచి సంతోషం కూడా వెళ్ళిపోయింది చాలా రోజుల తర్వాత పెళ్లి జరుగుతుంది మీరు ఎక్కడున్నా మీ ఆశీర్వాదాలు తనకి ఉండాలి అని నమస్కరిస్తుంది.

Advertisement

అదే సమయంలో అక్కడికి వచ్చిన హిమ తన మనసులో మాత్రం సౌర్యకి బావకి పెళ్లి ఎలాగైనా పెళ్లి చేయాలని అనుకుంటుంది.మరోవైపు స్వప్న తన భర్తకు తాను ఎలా చెప్తే అలాగే వినాలి. అడ్డు చెప్పకూడదు అంటూ వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు శౌర్య బాధపడుతూ ఉండగా సౌందర్య అక్కడికి వెళ్లి ఏంటే అంతగా కోపంగా చూస్తున్నావ్.

Advertisement

నేను నీ కన్నా ఒక అక్షరం ఎక్కువే అంటూ చెప్పగా సౌర్య నువ్వు నాకన్నా అన్నిట్లోనూ ఎక్కువే నాది ఆటో రేంజ్ మీది హై రేంజ్అని మాట్లాడుతుంది దీంతో నీకేం తక్కువ చేశాను దాంతో పాటే సమానంగా చూస్తున్నాను కదా అని అడుగుతుండగా అంతలోపు ఆనంద్ రావు వచ్చి ఒక అబ్బాయి ఫోటో చూపిస్తాడు ఆ ఫోటో చూసిన సౌర్య ఏం చేస్తాడు లారీ డ్రైవర్ ఆటో డ్రైవరా అంటూ మాట్లాడుతుంది. తను కూడా ఒక డాక్టరే అని సౌందర్య సమాధానం చెప్పగా తనకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

మరోవైపు ఆనంద్ రావు ప్రేమ్ హిమ ముగ్గురు టిఫిన్ షాప్ లో కూర్చుని మాట్లాడుతుంటారు. ఆ సమయంలో ప్రేమ్ తనకు పెళ్లి ఇష్టం లేదా లేకపోతే సౌర్యనిచ్చి పెళ్లి చేయడం కోసం అలా మాట్లాడుతుందా అంటూ సందేహపడతాడు ఇదే విషయమే హిమను అడిగితే సౌర్యను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెబితే తనకు హెల్ప్ చేయడం ఉద్దేశంతో నాకు బావను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెబుతుంది.

Advertisement

ఇదంతా శోభ కారులో నుంచి వింటూ ఉంది. మరోవైపు నిరపమ్ సౌర్య దగ్గరికి వెళ్లి నువ్వు నాకు ఒక సహాయం చేయాలని అడగగా ఏంటి ఇంట్లోంచి వెళ్లిపోమంటావా డాక్టర్ సాబ్ అని అడుగుతుంది. అలా ఎందుకంటాను సౌర్య ఆ శోభ మా మమ్మీ ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని ప్లాన్ చేస్తున్నారు. వారికి సరైన సమాధానం చెప్పేది నువ్వు ఒకటే ఎలాగైనా నువ్వే దగ్గరుండి మా పెళ్లి చేయించు అంటూ బ్రతిమాలుతాడు. డాక్టర్ సాబ్ అలా అడిగేసరికి మీ పెళ్లి అయిపోతే నాకు ఒక పని అయిపోతుందనీ భావించి చేసేదేమీ లేక తన పెళ్లి చేస్తానని డాక్టర్ సాబ్ కు హామీ ఇస్తుంది.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

Most Popular

Recent Comments