Sudigali sudheer : హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ రష్మీ, సుధీర్ ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లి తెరపై ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూసి ఫిదా అయిన వారి సంఖ్యకు లెక్కేలేదు. కేవలం ప్రేక్షకులే కాదండోయ్.. జబర్దస్త్ కమెడియన్లు, కమెడియన్ల కుటుంబ సభ్యులు కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండని కోరుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సుధీర్.. రష్మీ ప్రేమపై చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. రష్మీ అంటే తనకు ఇష్టమని… చాలా సార్లు ఆన్ స్క్రీన్ ప్రేమను ఒలకబోశాడు. కానీ పలు ఇంటర్వ్యూల్లో మాత్రం మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఏం లేదంటూ చాలా సార్లే చెప్పారు. అయినా వీరిద్దరి మధ్య ప్రేమ ఉందనే చాలా మంది నమ్ముతున్నారు.

జాగా ప్రసారమైన ఓ షో ప్రోమోలో… రష్మీ నా గుండెల్లోనే ఉంటుంది అంటూ కామెంట్లు చేశారు. అలాగే అందరి ముందు సుడిగాలి సుధీర్ ఓపెన కావడం హాట్ టాపిక్ గా మారింది. జీ తెలుగులో ఫాదర్స్ డే సందర్భంగా దిల్ సే అనే షో ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్ కి గోపిచంద్, డైరెక్టర్ మారుతి, రాజీవ్ కనకాల, సింగర్ శైలజ, ఆమె భర్త శుభలేఖ సుదాకర్ తదితరులు హాజరై సందడి చేశారు. ఇదే వేదికపై సుధీర్ ఓపెన్ అయ్యాడు. రష్మీ తన గుండెల్లోనే ఉంటుందని తెలిపాడు.
Read Also : Sudigali Sudheer : సూపర్ సింగర్ జూనియర్ కోసం కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సుడిగాలి సుదీర్?