...

Sudigali sudheer: స్టేజీపై సుధీర్ స్టెప్పులు.. ఎక్కడో దూరినట్టుందంటూ మనో కామెంట్లు!

Sudigali sudheer: సుడిగాలి సుధీర్ బుల్లితెరపై చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మాజిక్ షోల్ చేసే స్థాయి నుంచి టాప్ యాంకర్ గా, సినీ నటుడిగా మారాడు. అయితే ఈ మధ్య ఏ షోలో చూసినా సుధీర్ యే కనిపిస్తున్నాడు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలతో బిజీగా మారిపోయాడు. కానీ సుధీర్ ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. కానీ పరిస్థితులన్నీ ఒకేలా ఉండవని తెలుకోలేకపోయాడు. ఇప్పుడు సుధీర్ మొత్తానికే ఈటీవీకి దూరంగా ఉండిపోయాడు. ముందుగా ఢీ నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి వచ్చేశాడు.

ఇక చివరకు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా రాంరాం చెప్పేశాడు. అయితే మల్లెమాల నుంచి పూర్తిగా విడిపోయిన సుధీర్… స్టార్ మాలోకి జంప్ అయ్యాడు. తనకేదో సినిమా ఆఫర్లు వచ్చాయని, టైం లేక షోలు చేయడం లేదంటే ఒకలా ఉండేది. కానీ ఇక్కడ మానేసి అక్కడ చేరిపోయాడు. దీంతో కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. విబేధాల వల్ల సుధీర్ ఇలా స్టార్ మాకు వెళ్లాడని అంటున్నారు. ఇక సింగర్ మనో సైతం స్టార్ మా సింగింగ్ షోకు జడ్జ్గా వెళ్లాడు. అయితే అక్కడ అనసూయ, సుుధీర్, మనోలు బాగానే సందడి చేస్తున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన ఓ ప్రోమోలో సుధీర్ తన కంటెస్టెంట్ తో, అనసూయ తన కంటెస్టెంట్ తో కలిసి స్టెప్పులు వేశారు. సుధీర్ ఎంతో కష్టపడి వేసిన స్టెప్పులపై మనో కౌంటర్ వేశాడు. సొరంగంలో దూరి దూరినట్టుంది అంటూ సెటైర్ వేశాడు. ఏంటి సార్ అలా అంటారు.. ఎంతో కష్టపడి వేశాను అని సుధీర్ కవర్ చేసుకుంటాడు.