...

Janaki Kalaganaledu: చెఫ్ కాంపిటీషన్ కు వచ్చిన కన్న బాబు, సునంద.. టెన్షన్ లో రామ చంద్ర..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో టూరిస్టులు రామ చంద్ర చేసిన ఫుడ్ బాగుంది అని చెప్తారు.

ఈ రోజు ఎపిసోడ్ లో రామచంద్ర చేసిన పాయసం బాగుంది అని చెప్పి 500 రూపాయలను ఇస్తారు. అప్పుడు మిగిలిన వారు కూడా ఆ పాయసం కోసం ఎగబడి మరి ఆ పాయసం కొనుక్కొని తాగుతారు. అప్పుడు గోవిందరాజు,జ్ఞానాంబ ఆనంద పడుతూ ఉంటారు. ఆ తరువాత జడ్జి లు టాప్ 5 మెంబెర్స్ ని సెలెక్ట్ చేయగా వారిలో ఐదవ విజేతగా రామచంద్ర జడ్జి మహేష్ సెలెక్ట్ చేస్తాడు.

అప్పుడు జ్ఞానాంబ కుటుంబం మొత్తం సంతోష పడుతూ ఉంటారు. మరొకవైపు మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంతలోనే జ్ఞానాంబ ఇంటికి కన్నబాబు,సునంద వస్తారు. అప్పుడు జానకి దంపతుల గురించి అడుగుతారు. అప్పుడు మల్లిక మా బావ నేషనల్ మాస్టర్ చెఫ్ పోటీలకు హైదరాబాద్ కి వెళ్ళాడు.

ప్రస్తుతం సెమీఫైనల్ లో ఉన్నాడు. రేపోమాపో ఫైనల్లో గెలిచి ఇంటికి ఐదు లక్షలతో బహుమతి తో తిరిగి వస్తాడు అని చెప్పడంతో వారిద్దరూ షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు జానకి,రామచంద్ర కోసం ఒక వాచ్ గిఫ్ట్ గా ఇస్తుంతనే స్వయంగా రామచంద్ర నా కళ్ళు మూసుకో అని చెప్పి తన చేతికి వాచ్ తొడుగుతుంది.

ఆ తరువాత చెఫ్ కాంపిటేషన్ ఫోటీలకు కన్నబాబు, సునంద రావడంతో జ్ఞానాంబ కుంటుంబం షాక్ అవుతారు. అప్పుడు గోవిందరాజు ఎందుకు వచ్చారు అని అడగగా మీ అబ్బాయి రామచంద్ర కోసం వచ్చాను అని కన్నబాబు తల్లి జ్ఞానాంబ కు చెబుతుంది. ఆ తరువాత సెమీ ఫైనల్స్ లో భాగంగా గెస్ట్ గా అరియనా గ్లోరీ ను కూడా ఇన్వైట్ చేస్తారు.

అప్పుడు జెడ్జ్ ప్రభా రమేష్ పాటిస్పెట్ చేసేవారిని ప్రోత్సహిస్తుంది. ఆ తరువాత జెడ్జ్ సంజయ్ నాన్ వెజ్ టాస్క్ ము ఇస్తాడు. ఇక నాన్ వెజ్ ఐటమ్స్ లో మీకు ఇష్టమైన స్పెషల్ ను తయారు చేయమని సంజయ్ చెప్పడంతో రామచంద్ర ఒకసారిగా స్టన్ అవుతాడు. ఇక రామచంద్ర నేను మాంసం ముట్టుకోను సార్ దానికి బదులుగా ఏదైనా వంట చేస్తా అని అంటాడు. దానికి అక్కడ జడ్జ్ లు తిరస్కరిస్తారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.