Anchor anasuya: నీ భర్త రాముడే కావొచ్చు.. నీవు మాత్రం సీతవు కావంటూ అనసూయపై కామెంట్లు!

Anchor anasuya: బోల్డ్ అండ్ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అటు సినిమాల్లోనే కాకుండా, టీవీ షోలలోనూ అనేకమైన ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది ఈ అమ్మడు. ఈ మధ్య ఆమె ఏం మాట్లాడినా, ఏ డ్రెస్ వేస్కున్నా వార్తే అవుతుంది. ఇటీవలే వెకేషన్ కు వెళ్లొచ్చిన ఈ బామ.. తన పెళ్లి రోజు సందర్భంగా చేసిన ఓ పోస్టు తెగ వైరల్ అయింది. అందులో ఆమె తన భర్తకు లిప్ లాక్ ఇస్తూ కనిపించింది. అయితే తాజాగా యాంకర్ అనసూయ త భర్త రాముడు అంటూ కామెంట్లు చేసి మరోసారి వైరల్ గా మారింది.

Advertisement

Advertisement

అయితే తాజాగా జబర్దస్త్ కార్యక్రమం ప్రోమో రిలీజ్ అయింది. అందులో రైజింగ్ రాజు అనసూయగా కనిపించాడు. దీంతో అనసూయన తలబాదేసుకుంది. ఈ స్కిట్ లో అనసూయన హోం టూర్ అంటూ ఓ స్కిట్ వేశారు. ఇక ఇంట్లో అనసూయ ఏఎలా ఉంటుందో అని కౌంటర్ వేశారు. ఫేస్ బుక్ లైవ్ లో అనసూయ నెటిజెన్ల మీద ఎలా ఫైర్ అవుతుందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఇదే సమయంలో అనసూయ భర్తగా దొరబాబు ఎంట్రీ ఇస్తాడు. ఇది చూసిన అనసూయన.. తన భర్త స్థానంలో దొరబాబును పెట్టడంపై తట్టుకోలేకపోయింది.

Advertisement

మా ఆయన రాముడు.. ఇలాంటి దొరబాబుని మా ఆయనగా చూపిస్తారా అంటూ ఫైర్ అవుతుంది. అయితే ఈ కామెంట్ పై నెటిజెన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మీ ఆయన రాముడే కావొచ్చు కానీ.. నీవు మాత్రం సీతవు కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రం దర్జాలో ఈమె నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

 

Advertisement
Advertisement