Solar eclipse 2022 : ఈరోజే సూర్య గ్రహణం. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా ఎప్పుడు ఏర్పడుతుందనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఇది వరకు ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తొలి సూర్య గ్రహణం సంభవించగా.. ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. సూర్య, చంద్ర గ్రహణాలు రెండు చొప్పున రానున్నాయి.
ఈ అమావాస్యకు సంభవించే సూర్య గ్రహణంతో దాని కోటా పూర్తవుతుంది. ఈ ఏడాది నవంబర్ 7, 8వ తేదీల్లో చంద్రగ్రహణం రాబోతుంది. దీపావళి అమావాస్య నాడు రానున్నందున సూర్య గ్రహణానికి హిందూ పంచాంగం ప్రకారం ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. దీపావళి నాడు చేసే లక్ష్మీపూజను ఒకరోజు ముందే భక్తులు జరుపుకున్నారు. గ్రహణం నాడు దేశ వ్యాప్తంగా ఆలయాలన్నీ మూత పడనున్నాయి.
చిత్తూరు జిల్లా శ్రీకాళ హస్తిలోని ఆలయం మాత్రం దీనికి మినహాయింపు. భారత్ లో సూర్య గ్రహణం సాయంత్రం 4.30 గంటలకు ఆరంభం అవుతుంది. 5.42 నిమిషాలకు ముగుస్తుంది. యూరప్, మిడిల్ ఆస్ట్, ఆఫ్రికా ఈశాన్య ప్రాంతాలు, పశ్చిమ ఆసియా నార్త అట్లాంటిక్ సముద్ర తీరం, హిందూ మహా సముద్రం ఉత్ర ప్రాంతాల్లో నివసించే ప్రజలు పాక్షికంగా ఈ సూర్య గ్రహణాన్ని తిలకించవచ్చు.
Read Also : Solar eclipse 2022 : సూర్య గ్రహణం సమయంలో ఈ పనులు అస్సలే చేయకూడదు, ఏంటంటే?