Solar eclipse 2022 : సూర్య గ్రహణం సమయంలో ఈ పనులు అస్సలే చేయకూడదు, ఏంటంటే?

Do and do not things in solar eclipse 2022 time
Do and do not things in solar eclipse 2022 time

Solar eclipse 2022 : ఈరోజు సూర్యగ్రహణం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది సూర్య గ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణం పాక్షికంగానే ఉన్నప్పటికీ మన దేశంలో కనిపిస్తుంది. అయితే ఈ సూర్య గ్రణం హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైన దీపావళి పండుగ రోజున రాబోతుంది. ఇకపోతే ఈరోజు ఏం చేయాలి, ఏమేం చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Do and do not things in solar eclipse 2022 time
Do and do not things in solar eclipse 2022 time

సూర్యగ్రహణానికి ముందు మరియు తలస్నానం చేయాలి. గ్రహణానికి కనీసం రెండు గంటల ముందు ఆహారం తీసుకోండి. గ్రహణ సమయంలో ధ్యానం చేయడం చాలా మంచిది. సూర్య గ్రహణం సమయంలో శివుడు, గురువు, విష్ణువు స్తోత్రాలను పఠించాలి. చెడు ప్రభావాన్ని నివారించడానికి పవిత్ర తులసి ఆకులను నీటి పాత్రల్లో ఉంచాలి. సూర్యగ్రహణం తర్వాత ఇంటిని శుభ్రం చేసి ఇంటి గంగాజలం నీళ్లను చల్లాలి. ఇది సానుకూలతను తెస్తుంది. గ్రహణం యొక్కు చెడు ప్రభావాల నుంచి రక్షిస్తుంది.

Advertisement

సూర్య గ్రహణ సమయంలో సూర్యుడిని నేరుకగా శరీరం బహిర్గతం కాకుండా ఉండండి. వంట చేయడం, తినడం మానుకోవాలి. నేరుగా సూర్య గ్రహణాన్ని కంటితో చూడకూడదు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు రాకూడదు. గ్రహణానికి ముందు వండిన ఆహారం తినకూడదు. గ్రహణానికి ముందు ఇంట్లో ఉన్న నీరు, అన్నం, ఇతర పదార్థాలను తినకూడదు. పదార్థాలపై తులసి ఆకుల్ని వేయాలి. గ్రహణ సమయంలో నిద్రించడం లేదా బయటకి వెళ్లడం మానుకోండి. మీ ఇంటి నుంచి సూర్యరశ్మిని దూరంగా ఉంచడి. మీ తలుపులను కర్టెయిన్లతో కప్పేయండి.

Read Also : Solar eclipse 2022: సూర్యగ్రహణ సమయ కాలం, కనిపించే ప్రాంతాలు ఏవో తెలుసా?

Advertisement

Read Also : Surya Grahanam: ఈ ఐదు రాశుల వారు పొరపాటున కూడా ఈరోజు గ్రహణాన్ని చూడొద్దు, ఎందుకంటే?

Advertisement