Shanmukhh jaswanth : షణ్ముఖ్ జశ్వంత్ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కుర్రాడు షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ సిరీస్, కవర్ సాంగ్స్ తో పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చాక మరింత మందికి చేరువయ్యాడు షణ్ముఖ్ జశ్వంత్. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో మరో కొత్త సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నాడు షణ్ముఖ్. తాజాగా షన్ను ఇంట్లో విషాదం నెలకొంది. షన్ను బామ్మ మరణించారు. వాళ్ల బామ్మతో మాట్లాడుతుండగా తీసిన ఓ వీడియోని షేర్ చేసి ఆర్ఐపీ అని బాధపడుతూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ పోస్టు చేశాడు.
ఈ వీడియోలో షన్ను బామ్మని నా పెళ్లి అయ్యే దాకా ఉండవా అంటే బామ్మ ఏమో ఉంటానో ఉండనో అని అంటుంటే వెనక నుండి షన్ను పెళ్లి అయ్యే దాకా ఉంటావు అని ఎవరో అన్నారు. ఈ వీడియోను షేర్ చేసిన షన్ను… నా పెళ్లి చూడకుండానే బామ్మ వెళ్లిపోయిందని బాధపడ్డాడు. బామ్మ మరణంతో షన్ను సహా కుటుంబ సభ్యులు కూడా విషాదంలో మునిగారు.
బిగ్ బాస్ నుండి వచ్చాక షన్నుకు దీప్తి సునయనకు బ్రేకప్ అయింది. ఈ విషయంలోనే షన్ను చాలా బాధ పడ్డాడు. ఇప్పటికి కూడా దీప్తి గురించి సన్నిహితుల వద్ద బాధ పడతాడని సమాచారం. ఆ బాధ నుండి ఇంకా తేరుకోక ముందే మరో బాధ షన్ ముఖ్ జశ్వంత్ ను చుట్టు ముట్టింది.
Read Also :Siri and shanmukh: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సిరి, షణ్ముఖ్.. ఏంటో తెలుసా?