Siri and shanmukh: సిరి హన్మంత్, షణ్ముఖ్ జశ్వంత్ ల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బిగ్ బాస్ షోకు వెళ్లిన వీరిద్దరూ పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువ సొంతం చేసుకున్నారు. అయితే వారు బిగ్ బాస్ లో ఇచ్చుకున్న హగ్ లు, కిస్ ల కారణంగా విపరీతమైన ట్రోల్స్ కు గురయ్యారు. దీని వల్లే దీప్తి సునయనతో షణ్ముఖ్ కు బ్రేకప్ అయింది. ఈ అనూహ్య పరిణామాలతో కొంత కాలం పాటు వార్తల్లో నిలిచారు వీరిద్దరూ. కానీ తమ టాలెంట్ తో నెగటివ్ కామెంట్లు చేసే వారి నోరు మూయించారు. ఇటీవలే సిని హన్మంత్ బీఎఫ్ఎఫ్ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు వెల్లడించగా… తాజాగా షణ్ముఖ్ జశ్వంత్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇన్వెస్టిగేషన్ త్వరలో ప్రారంబం అవుతుందని కేసు వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అటు బీఎఫ్ఎఫ్, ఏజెంట్ ఆనంద్ సంతోష్ … ఈ రెండూ కూడా తెలుగు ఓటీటీ ప్లాట్ పామ్ ఆహాలో ప్రసారం కానున్నాయి. మొత్తానికి వారు పంచుకున్న గుడ్ న్యూస్ విని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.