Devatha july 8 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య,రాధ ఇద్దరు మాధవలో వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో దేవుడమ్మ దేవుడు దగ్గరికి వెళ్లి గురించి వేడుకుంటూ ఉంటుంది. ఎన్ని పూజలు చేసిన నా కోడల్ని చూపించవా అంటూ బాధపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వాయనం ఇస్తూ పూజారి అన్న మాటలు తలుచుకుంటుంది. ఆ తర్వాత భాగ్యమ్మ ఎదురు పడటంతో రుక్మిణి గురించి చెప్పుకొని బాధపడి అక్కడ నుంచి వెళ్లిపోతుంది.
అప్పుడు భాగ్యమ్మ తన బిడ్డ, మనవరాలు బతికే వున్నారని నీ కనిపించడకుండా దాక్కున్నారని అని మనసులో అనుకుంటుంది. మరొకవైపు దేవి ఆదిత్యతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక రాద ఒంటరిగా వెళ్లడంతో మాధవ, దేవి ఎక్కడ అని అడగగా నా పెనిమిటితో కలిసి బయటికి వెళ్ళింది అనడంతో మాధవ కోపంతో రగిలిపోతాడు. అప్పుడు రాధ దేవి తన తండ్రితోనే కదా వెళ్ళింది మీకెందుకు అంత మంట అని అంటుంది.
నీకు దేవి మీద ప్రేమ లేదని అదంతా ఎవరికోసం చూపిస్తున్నావో నాకు అర్థమవుతుంది అని అంటుంది రాధ. మరొకవైపు దేవుడమ్మ రుక్మిణి ఫోటో తీసుకొని నాకు ఎందుకో నువ్వే వాయనం ఇచ్చావు అని అనిపిస్తుంది అంటూ ఆ ఫోటోని తీసుకొని గుడికి బయలుదేరుతుంది. ఆ ఫోటోని పూజారికి చూపించాలి అని అనుకుంటుంది. అప్పుడే దేవుడమ్మ చేతిలో రుక్మిణి ఫోటో చూసి భాగ్యమ్మ షాక్ అవుతుంది.
ఇక ఇంతలోనే ఆదిత్య దేవుని పిలుచుకుని వస్తాడు. అయితే దేవుడమ్మ దేవితో మాట్లాడుతూ ఉండగా భాగ్యమ్మ మాత్రం రుక్మిణి ఫోటోని దేవి ఎక్కడ చూస్తుందో అని భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత దేవిని సత్య దగ్గర ఉండమని చెప్పి గుడికి బయలుదేరుతుంది. ఆ తర్వాత భాగ్యం మా రుక్మిణి గురించి దేవుడమ్మ పడుతున్న బాధను చూసి నువ్వు లోపల కుమిలిపోతూ ఉంటుంది
Devatha : రాధని చూసిన పూజారి దగ్గరకి.. రుక్కు ఫోటోతో వెళ్లిన దేవుడమ్మ..
మరొకవైపు రాధ చిన్మయికి అన్నం తినిపిస్తూ ఉండగా ఇంతలో జానకి వచ్చి చిన్మయిపై అరుస్తుంది. నీకు తినడానికి రాదా!ఎవరు ఎప్పుడు మనతో ఉంటారు తెలియదు అని మాట్లాడడంతో రాధ బాధపడుతుంది. మరొకవైపు భాగ్యం మా దగ్గరికి కమల భాషా వచ్చి రుక్మిణి ఎక్కడ ఉందో తెలిస్తేనే మాకైనా చెప్పమ్మ అని అనడంతో తనకు తెలియదు అని గట్టిగా చెబుతుంది భాగ్యమ్మ.
అప్పుడు కమల అత్తమ్మ చాలా బాధపడుతోంది నా బిడ్డను దత్తత తను అనడంతో భాగ్యమ్మ ఒక రేంజ్ లో విరుచుకుపడుతుంది. అంతేకాకుండా దేవుడమ్మ ఇంటికి వారసాలు తప్పకుండా వస్తుంది అని గట్టిగా చెబుతుంది. ఆ తర్వాత దేవుడమ్మ రుక్మిణి ఫోటో తీసుకొని గుడికి వెళ్లి ఆ ఫోటోని కింద పెట్టి హారతి తీసుకుంటూ ఉండగా ఇంతలో గాలికి ఆ ఫోటో ఎగిరిపోతుంది.
ఆ ఫోటో కనిపించకపోయేసరికి బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది దేవుడమ్మ. ఆ ఫోటో సత్య చేతికి చిక్కడంతో అనుమానం వచ్చి నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను అత్తయ్య అని మనసులో అనుకుంటూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha july 7 Today Episode : మాధవలో మార్పు చూసి టెన్షన్ పడుతున్న రాధ..దేవి మాటలకు బాధపడిన ఆదిత్య ?