Devatha july 7 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవి వచ్చి మాధవను చేయి చూపించమని అడగడంతో మాధవ టెన్షన్ పడుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో దేవి చేయి చూపించమని మాధవను అడగడంతో మాధవ టెన్షన్ పడుతూ నువ్వు కళ్ళు మూసుకో అని చెప్పి రూమ్ లోకి వెళ్లి స్కెచ్ తో పేరు రాసుకొని వస్తాడు. ఆ తర్వాత కళ్ళు తెరవమని చెప్పడంతో దేవి మాధవకు జామకాయలు ఇచ్చి భాగ్యమా అవ్వ జామకాయలు ఇచ్చింది అని చెబుతుంది.
అప్పుడు మాధవ, రాధ ఒక్కొక్కరిని దేవికి దగ్గర చేస్తుంది అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత రాధ ను,ఆదిత్య స్కూల్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. మాధవ దేవి కూడా అక్కడికి రావడంతో వెంటనే రాధా ఇవాళ ఆఫీసర్ సారు స్కూల్లో జాయిన్ చేస్తా అని చెప్పాడు అనగా వెంటనే మాధవ వెటకారంగా మాట్లాడుతూ నువ్వు కూడా వెళ్ళు రాధ అంటూ కొత్తగా మాట్లాడడంతో రాధా ఆశ్చర్య పోతుంది.
Devatha : దేవి మాటలకు బాధపడిన ఆదిత్య…
అప్పుడు స్కూల్లో మేడం నువ్వు మీ డాడీ లాగా కలెక్టర్ అవ్వాలి అనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు మేడం పదేపదే ఆదిత్యను తండ్రి అనడంతో వెంటనే దేవి ఆయన నా తండ్రి కాదు స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చాడు అని అంటుంది. ఆ మాటకు ఆదిత్య బాధపడుతూ ఉంటాడు.
మరొకవైపు మాధవ, రాధఫోటో చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో జానకి అక్కడికి వచ్చి రాధలో చాలా మార్పు వచ్చింది అని అంటుంది. మరొకవైపు ఆదిత్య రాధ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాధవా సారు ఏదో పెద్ద ప్లాన్ వేశాడు అందుకే మార్పు వచ్చింది అన్న విధంగా నటిస్తున్నాడు అని ఉంటుంది రాద. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha July 6 Today Episode : రుక్మిణి కోసం దెబ్బలు తిన్న సూరి.. బాధపడుతున్న ఆదిత్య..?